ఇక ఈ రేషన్ షాపులు కన్పించవా




ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇకపై రేషన్ షాపులు అనేవి కన్పించవా..అంటే ఆ ప్రమాదం అనుకున్న దానికంటే చాలా తొందరగానే వచ్చేట్టు కన్పిస్తోంది.సబ్సిడీ బియ్యం కానీ..రేషన్ కార్డులపై ఇచ్చే ఏ నిత్యావసర వస్తువులైనా అవి వాడేవాళ్లకి వాటి విలువ తెలుస్తుంది. కుటుంబానికి ఇన్ని కేజీలని ఇచ్చే ఈ రేషన్ సరుకులు ఆ తర్వాత తర్వాత కాలంలో మనిషికి ఇన్ని అని రేషన్ పెట్టేశాయ్ ప్రభుత్వాలు..ఐతే ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే, అటు  ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వం రేషన్ డిపోలను రిలయన్స్, బిగ్‌బజార్ కి అమ్మేస్తోందనిప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ప్రతిపక్షపార్టీలు విమర్శలు చేస్తున్నాయ్. ఐతే ఇవి అపోహలు అని చెప్తూనే సాక్షాత్తూ మంత్రి పత్తిపాటి పుల్లారావ్ఓ  వివరణ ఇచ్చారు. మామూలుగా దొరికే రేటు కంటే ఈ రెండు దుకాణాల్లో 20శాతం తక్కువకే దొరుకుతాయి ఎవరైనా కొనొచ్చు అంటూ ఓ ప్రకటన చేశారాయన. ఇంతకీ ఇవి రేషన్ డిపోలకి సంబంధం లేకపోతే..ఎందుకు అంత తక్కువ రేటుకి అమ్ముతారు. ఇంకో ప్రశ్న..లాభం లేనిదే
వ్యాపారి వరదన పడిపోడు..మరి ఈ రెండు సంస్థలకి ప్రజలపై ఎందుకింత ప్రేమ పుట్టుకొచ్చింది. ఇది ఏపీలో రేగుతోన్న వివాదం అయితే,


మరి తెలంగాణలో అయితే ఇక ఏకంగా రేషన్ షాపులే ఎత్తేస్తారనే గందరగోళం సాగుతోంది. దీనిపై అన్ని న్యూస్ పేపర్లలో బాగానే కవరేజీ కూడా ఇచ్చారు ఓ రకంగా ఈ విషయంలో తెలుగు రాష్ట్రప్రభుత్వాలు రెండూ ఒకటే విధానంలో పోతోన్నట్లు కన్పిస్తుంది. ఎటు తిరిగీ ఈ ప్రచారాలు నిజమైతే
సామాన్యుడు కాదు కదా..మధ్యతరగతి జనానికి కూడా ఇక సరుకులు ఏ పండగకో మాత్రమే కొనే రోజులు వచ్చేట్టు ఉన్నాయ్

Comments