ఫీచర్ ఫోన్ల రేట్లకి స్మార్ట్‌ఫోన్లు

భలే మంచి బేరాలు వచ్చి పడుతున్ర్నాయ్.. ఫీచర్  ఫోన్ల రేట్లకి స్మార్ట్‌ఫోన్లు..ఇదీ ఇప్పుడు ట్రెండ్. డేటా వార్ పూర్తైంది. జియో తన టారిఫ్‌లు పెంచడంతో ఇక ఇండస్ట్రీలో ఇప్పటిదాకా ఇస్తోన్న ఆఫర్స్ పెద్దగా  ఉండవనే ప్రచారం జరుగుతోంది. ఐతే కస్టమర్ల బేస్ పెంచుకునేందుకు టెల్కోలు హ్యాండ్ సెట్ల అమ్మకాలపై దృష్టి పెట్టాయ్. ఏదోక ప్లాన్‌తో కస్టమర్లకి బెనిఫిట్ చూపిస్తూ తమ ఆదాయం పెంచుకునే బాటలో పడ్డాయి. వాటిలో భాగంగానే బిఎస్ఎన్ఎల్ మైక్రోమ్యాక్స్‌తో , ఎయిర్‌టెల్ లావా ఫోన్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయ్. తమ కనెక్షన్ తీసుకుంటే ప్రతి నెలా రీఛార్జిల తర్వాత ఏడాది తిరిగేసరికి క్యాష్ బ్యాక్ అంటూ రకరకాల ఆఫర్లు ముందుకు తెచ్చారు ఇప్పుడా లీగ్‌లోకి ఒడాఫోన్ కూడా చేరిపోయింది. రీసెంట్‌గా ఐడియాతో కలిసిపోతోన్న ఈ కంపెనీ మైక్రోమ్యాక్స్ భారత్ టు ఫోన్ కొనుగోలు చేస్తే తమ సిమ్ ఇస్తామంటోంది అది కూడా రూ.2899కే.  ప్రతి నెలా రూ.150 చొప్పున మూడేళ్లపాటు రీఛార్జ్ చేయించాలి. అలా మూడేళ్ల తర్వాత రూ.1900 వెనక్కి ఇస్తారు. అంటే మూడేళ్ల తర్వాత ఈ ఫోన్ ధర రూ.999కి సమానమవుతుంది. ఐతే వొడాఫోన్ ఈ స్పెషల్ ఆఫర్ లేకుండా..అంటే రీఛార్జీలు లేని ప్లాన్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే క్యాష్ బ్యాక్ ఉండదు . అలాగైనా 4జి స్మార్ట్ ఫోన్ రూ.2899కి రావడం కొద్దిగా మంచి విషయంగానే యూజర్లు భావించవచ్చు. ఐతే క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే మొదటి 18నెలలకు రూ.900, తర్వాతి 18నెలలకు రూ.1000 వస్తాయి. అది కూడా ఒడాఫోన్ ఎం-పెసా వాలెట్‌లో జమ అవుతుంది. అసలు ఓ మొబైల్ ఫోన్ మూడేళ్లపాటు ఇప్పుడు ఎవరూ వాడటం లేదు.అసలు ఆరునెలలు దాటితేనే కొత్త ఫోన్లు వాడేవాళ్లున్నారు. అలాంటిది అన్ని రోజులు వాడి క్యాష్ బ్యాక్ తీసుకోవడమనేది కాస్త సందేహమే

Comments