విశాఖ బిచ్చగత్తె రేప్.. వర్మకి ఏంటి రిలేషన్



నిజమే ఏ రిలేషనూ లేదు. ఎలాంటి సంబంధం లేదు. కానీ కొన్ని క్రైమ్స్‌పై ఆయన స్పందన చూస్తే..ఇలాంటి ఓ సంఘటన లేదంటే నేరం పై ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో అన్పించకమానదు. ఎందుకంటే ఢిల్లీలో రేప్ ఘటన సమయంలో ఆయన అలానే స్పందించాడు. "రేప్ చేసిన యెదవలని వెంటనే చంపేయాలని ఉరేయాలని చాలామంది అంటున్నారు. కానీ నాకు మాత్రం అలాంటోడిని పట్టుకుని వాడు ఎఁదుకు అలా బిహేవ్ చేశాడు. అలా చేస్తున్న సమయంలో వాడి మానసిక స్థితి ఏంటి" ఇలాంటి అనేక ప్రశ్నలు వేశారాయన. అలా సైకలాజికల్‌గా ఎంక్వైరీ చేసి ట్రీట్‌మెంట్ ఇస్తేనే అసలు మోటో తెలుస్తుందని తద్వారానే అలాంటి ఘటనలు జరగకుండా చూడొచ్చనేది రామ్ గోపాల్ వర్మ కామెంట్ అది నిజమే. అందుకే ఇప్పుడు విశాఖపట్నంలో చుట్టూ అంతమంది చూస్తున్నా వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా తన పని తాను దీక్షగా చేసేసుకుని పోయిన ఓ లఫంగి గాడి ఇష్యూ చూస్తే ఆర్జీవీ ఎలా రియాక్టవుతారనేది ఆసక్తి కలిగించేదే. సదరు ఛండాలుడితో పాటు సాధారణంగా నాలుగు గోడల మధ్య జరిగే సంసారం, ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేది రేప్..మరి అలాంటిది కళ్లముందే జరుగుతుంటే హ్యాపీగా
చోద్యం చూసేసిన యెదవ సమాజానికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో కూడా రామ్‌గోపాల్‌వర్మ లాంటి మేధావులే చెప్పాలి. ఇదేదో వెటకారంగా రాస్తున్నది కాదు నిజంగానే ఫీలై రాసింది


Comments