ఇప్పుడే ఎందుకిలా



ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవి నుంచి విరమణ జరిగిన తర్వాత రాసిన పుస్తకంలో అంశాలు భలేగా దిపుచ్చుకుంటున్నాయ్ పేపర్లు. ఎవరికి అనువుగా వాళ్లు వార్తలు వండేసుకుని అధినేతల ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.  ప్రణబ్‌తో కేసీఆర్ నాకు రాష్ట్రమే ముఖ్యం పదవితో సంబంధం లేదు ఏ పదవి ఇచ్చినా ఫర్వాలేదు అని 2004 సమయంలో కేబినెట్‌లో జాయిన్ అయ్యే ముందు అన్న మాటలను ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటెమ్‌గా రాసుకున్నారు. కన్వీనెంట్‌గా దీన్ని హైలైట్ చేయడం వెనుక అసలు ఉద్దేశమేంటో అందరికీ తెలుసు. ఇందులో తప్పేం లేదు కానీ సందర్భం, ఔచిత్యం లేకుండా మొదటి పేజీలో వార్తల స్థానంలో గతించిన పరిణామాలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడమే తప్పు. ఇది డబ్బులతో పత్రికలు కొనేవారిని వంచించడమే


Comments