తెల్గీ కథ అలా ముగిసింది..ఆ నిజాలు ఎప్పటికీ బైటికి రావు

తెల్గీ కథ అలా ముగిసింది..ఆ నిజాలు ఎప్పటికీ బైటికి రావు.అబ్దుల్ కరీం తెల్గీ అంటే హాఠాత్తుగా ఎవరికీ గుర్తుకురాడు. అందులోనూ 1995 టైమ్‌లో పుట్టినోళ్లకి అస్సలు తెలీదు కూడా..వేలాది కోట్లరూపాయలు స్టాంపు పేపర్లకి నకిలీలు తయారు చేసి అమ్మడం ద్వారా సంపాదించిన కేసులో మెయిన్ కల్‌ప్రిట్ ఇతగాడు..ఇతగాడి రాకెట్ దేశం మొత్తం వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మనోడి ఏజెంట్లు కోట్లకి కోట్లు బొక్కేశారు. ఖజానాకి భారీగా బొక్క వేసిన ఇతగాడి వెనుక పెద్దలు చాలామంది ఉన్నారని అప్పట్లో(2001) బాగా విన్పించింది..అంతెందుకు ఈ కేసులోనే హైదరాబాద్ టిడిపి లీడర్ కృష్ణాయాదవ్ కూడా అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓ రకంగా రాజకీయ భవిష్యత్తు కూడా కోల్పోయాడు. అలాంటి తెల్గీకి మూడక్షరాల రోగం పట్టుకుందని విపరీతంగా ప్రచారంజరిగింది కూడా..ఐతే ఇతగాడు ఇవాళ బెంగళూరు జైలులోనే చనిపోయాడు. 2001లో అజ్మీర్‌లో పోలీసులకు చిక్కిన తెల్గీకి కోర్టు 30ఏళ్లు జైలు శిక్ష విధించింది. అందులో సగం అనుభవించాడు కూడా..ఈలోపే ఇలా జరగడం పాపం విచారకరమే..ఎందుకంటే ముదనష్టపు తెలివితేటలతో ఖజానాకి బొక్క అయితే వేసాడు కానీ..అతగాడి వెనుక పెద్దలే అంతా బొక్కేసారని అంటారు..ఇప్పుడీ మరణంతో ఆ నిజాలు ఎప్పటికీ బైటికి రావు

Comments