చిరంజీవి జంప్ ఖాయమేనా



ఇదీ ప్రచారం..జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్‌కి పవన్ కల్యాణ్ వెళ్లడంతో ఎవరి ఊహలకి వాళ్లు పదును పెట్టుకుని రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. అందులో ఇదీ ఒకటి. ఎందుకంటే గత కొద్దికాలంగా చిరంజీవి రాజకీయాల్లో మబ్బుగా ఉండిపోయాడు.ఆయన సినిమాలు, ఆయన వారసుల అప్‌డేట్స్ తప్ప జనం ఇష్యూలపై స్పందించింది లేదు. కనీసం పవన్ కల్యాణ్ అయినా ట్విట్టర్లో అప్పుడప్పుడూ ఏదోక కౌంటర్లు, రియాక్షన్లు చూపిస్తా తన ఫ్యాన్స్‌కి కాస్త ఊరట కలిగించే ట్రయల్స్ చేస్తున్నాడు. దీనిపై చాలామంది చాలారకాలుగా విమర్శలు గుప్పిస్తున్నా పట్టించుకోకుండా పంచ్‌లు పేలుస్తుంటాడాయన. చిరంజీవి విషయానికి వస్తే మార్చితో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతుంది. కాబట్టి ఆయన్ని టిడిపి తిరిగి ఎంపిగా నామినేట్ చేస్తుందని అందుకే ఆయన కొడుకు ప్రమోటర్ గా ఉన్న మేఘా టర్బోజెట్‌కి ప్రోత్సాహకాలు అందిస్తుందని కథనాలు వచ్చాయ్. అందులో నిజమెంతో తెలీదు కానీ, కాపులను దువ్వే ప్రయత్నంలో చంద్రబాబుకి చిరంజీవిసపోర్ట్ లభిస్తే తిరిగి 2019లో టిడిపిదే గెలుపు అనే అంచనాలున్నాయ్.


అందుకే ఇలా కొత్త పునరేకీకరణలు సినిమా ఓపెనింగ్స్‌లో కన్పిస్తున్నాయని
కొందరి అంచనా. సో అలా పవన్ జూ.ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్ కి వచ్చాడంటారు..ఐతే హారిక  హాసిని ప్రొడక్షన్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉన్న రిలేషన్ కారణంగానే పవన్ కల్యాణ్ ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చాడనేది చాలామంది కన్వీనెంట్‌గా ఒప్పుకుంటున్న మాట.

Comments