ఇక రేవంత్ రెడ్డి


రేవంత్ రెడ్డి తెలుగుదేశానికి గుడ్ బై చెప్పేశాడు..ముందు ఆయనకంటే టివి ఛానళ్లకే ఎక్కువ ఆత్రంగా ఉందని ఈ టైమ్‌లో నడిచిన బ్రేకింగ్స్ చూస్తుంటే అర్ధమైపోతోంది..ఆ సంగతి వదిలేస్తే ఇక రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం ఏంటో
చాలా క్లియర్‌గా కన్పిస్తూనే ఉంది. కాంగ్రెస్‌లో చేరడం..కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ముందుగా ఆయనకి అడ్డంకి ఏంటంటే జానారెడ్డి వ్యవహారశైలే...ప్రతిదానీకీ కేసీఆర్ ని పొగుడుతూ పొగిడించుకుంటూ మాట్లాడే జానారెడ్డికి రేవంత్ వ్యవహారశైలి ఖచ్చితంగా పడదు..ఎప్పట్నుంచో సంపత్ కుమార్ చెప్తోన్న బాహుబలి రేవంత్ రెడ్డే అవ్వాలి మరి.
ఎందుకంటే ఎప్పుడో ఆర్నెల్ల క్రితం నుంచే కాంగ్రెస్‌లోకి ఓ బాహుబలి వస్తాడు..దాంతోనే టిఆర్ఎస్ పరాజయం సాధ్యమవుతుందనే కామెంట్ చేసింది అతనే!


మరి టిడిపి లీడర్ల పరిస్థితి..ఏం ఉంది గట్టిగా రేవంత్ రెడ్డిని విమర్శిస్తే..ఓటుకు నోటుతో పోటు సిధ్దంగా ఉంటుంది. పైగా
చంద్రబాబుని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చులకన చేయలేదు..వేరే గతిలేకనే పార్టీ మారుతుంది కూాడ వాస్తవం..ఐతే భవిష్యత్తులో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ఉపయోగపడతాడా...రేవంత్‌కి కాంగ్రెస్ ఉపయోగపడుతుందా అన్నదే తేలాలి..ఐతే ఒకటి మాంచి దూకుడున్న నేతలు కరువైన తెలంగాణ కాంగ్రెస్ కి రేవంత్ ఓ అసెట్..అదెలా వాడుకుంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న..కోమటిరెడ్డిలు, జానారెడ్డిలు, ఉత్తమ్‌కుమార్‌లు ఏం చేస్తారో తెలీదు కానీ..రేవంత్ ఏం చేసినా..సూటిగా బాణం కేసీఆర్‌కే ఎక్కుపెడతాడు..ఎందుకంటే నెలరోజులకి పైగా బెయిల్ కూడా లేకుండా..జైల్లో గడిపిన కసి ఉంది కదా..అదే అతనికి ఫ్యూయెల్ చూద్దాం ఏం జరుగుతుందో!

Comments