ఇక ఈ అందాలు తెర వెనుకేనట!



కంగనా రనౌత్ ఇక నటించదట. మణికర్ణిక సిని్మా తర్వాత ఇకపై నటించనంటూ చాలారోజుల క్రితమే ఓపెన్‌గానే చెప్పేసిందామె..ఐతే అదంతా స్టంట్ ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడా నిర్ణయం నిజమే అనుకోవాలి. ఎందుకంటే తేజు పేరుతో ఓ చిన్నపిల్లల సినిమాని డైరక్ట్ చేయబోతోందట. స్వయంగా ఆమే ఈ విషయాన్ని చెప్పింది. దాదాపు 30శాతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తైందట. మణికర్ణిక పూర్తి కాగానే ఆ ప్రాజెక్టులోకి వచ్చేస్తోందట.
ఇందులో ఆమె కూడా ఓ 80ఏళ్ల పాత్ర చేయబోతోందట. దీనికోసం హాలీవుడ్ మేకప్, బాడీ డబుల్ వంటి అన్ని రకాల
టెక్నిక్స్ వాడతానని చెప్పేస్తోంది
ఈ మధ్యకాలంలో బాగా బోల్డుగా మాట్లాడేస్తోన్న బాలీవుడ్ బ్యూటీస్‌లో ఈమెదే పైచేయి. హృతిక్  రోషన్‌తో ఎఫైర్ ని బైటపెట్టేసిన తర్వాత కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సంచలనమే..బాలీవుడ్ లో పైకి రావాలంటే పడక ఎక్కాల్సిందే అని..అలాంటి అనుభవాలు తానూ చవి చూసానని చెప్పి అక్కడి బడాబాబులకు ఉచ్చపోయించింది కూడా..బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ అంటే కంగనానే చెప్పుకోవాలి..అందుకే ఇకపై ఈ భామ అందాలు తెరపైన కంటే తెరవెనుకే కన్పిస్తాయని సరిపెట్టుకోవాల్సి వస్తోంది..అన్నట్లు తేజు అనే క్యారెక్టర్ కాళ్లూ చేతులూ సరిగా లేని ఓ అమ్మాయి కథ అట..తాను ఎలా ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిందనే కథనంతో సినిమా ఉంటుంది

Comments