మోడీ భలే జోక్ పేల్చారే


ప్రధానమంత్రి మోడీ భలే జోకులు పేల్చుతారు..అందులో డౌట్ లేదు..రాజకీయవేదిక అయినా, ఇతర కార్యక్రమాల్లో అయినా ఆయన కాంగ్రెస్‌ని ఏదోలా ఇరుకునపెట్టేలా కామెంట్స్ చేస్తుంటారు..కానీ ఈ మధ్యకాలంలో అవి పెద్దగా పేలడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎంపికపై కూడా మాట్లాడుతూ,  పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ..దానిపై ప్రజల్లో అవగాహన ఉండాలి అంటూ ఏదో కామెంట్ చేశారు. ఇది మరీ హాస్యాస్పదం. ఏ పార్టీలో ఎలా ఏం జరుగుతుందన్నదీ జనాలకి తెలీదన్నది ఆయన అర్ధం.


డియర్ నరేంద్రమోడీ..ప్రజలకు ఏమీ తెలియదన్నది మీ నిశ్చితాభిప్రాయం అయితే అదలానే ఉంచుకోండి. పార్టీల దాకా ఎందుకు మీపై కామెంట్లు పెడితేనే అరెస్టులు చేయిస్తున్నారు..ఇది చాలదా ప్రజాస్వామ్యం ఎలా ఏడుస్తుందీ..ఇంకా పార్టీల సంగతి వరకూ ఎందుకు. ఐనా పక్క పార్టీల సంగతి ఎందుకు కానీ..బిహార్, పంజాబ్ ఎన్నికల్లో ఓటమిపై అద్వానీ, మురళీమనోహర్ జోషి కామెంట్లపై మీ పార్టీలో ఎప్పుడైనా చర్చించారా...కనీసం ఆ పరిస్థితి ఉందా..పార్టీలో గెలుపులు వస్తున్నంత కాలం ఎవరైనా మహానేతలే...కాస్త ఓటములు రానీయండి..అప్పుడు ప్రపంచం ఏంటో తెలుస్తుంది..ఇది వదిలేసి ఇతర పార్టీలకు సుద్దులు చెప్పడం ఎందుకు. చేతనైతే ఎమ్మెల్యేలు, ఎఁపిలు పార్టీలు మారకుండా ఉండేలా ఏదైనా చేసి కాస్తో కూస్తో పేరు తెచ్చుకోండి

Comments