తండ్రికి తగ్గ తనయుడు లోకేష్...తూచ్...!


ఏపి సిఎం చంద్రబాబునాయుడి కుమారుడిగానే లోకేష్ గతంలో తెలుసు.. ఆ హోదాతోనే ఆయనకి ఎమ్మెల్సీ సీటు దక్కింది..ఆ హోదాతోనే మంత్రిపదవి కూడా దక్కించుకున్నాడాయన.ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్నాళ్లనుంచో పార్టీని అంటపెట్టుకుని ఉన్నవాళ్లకి మార్కెట్ యార్డ్ పదవులుకూడా దక్కని సమయంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం ఎంతమందికో ఆగ్రహం కలిగించినా నిగ్రహించుకున్నారు...ఆహో ఓహో అంటూ పొగిడేశారు. ఐతే చినబాబు పనితీరుకి ఇవేవీ అడ్డంకులు కాలేదు. ఆయన సూపర్ గా పని చేస్తున్నారని టిడిపి వర్గాలు
చెప్పుకుంటుంటాయ్. చాలాసార్లు నోరుజారి కామెడీ క్రియేట్ చేసినా...పట్టించుకోరు. ఐతే ఇప్పుడే ఆయన నోటి నుంచి మరో మేలిరత్నంలాంటి మాట  జాలువారింది..దేశంలోనే అత్యంత పిన్నవయస్కుడైన మంత్రిగా చరిత్ర సృష్టించానని ఆయనకి ఆయనే కితాబు ఇచ్చుకున్నారు..మరి తన కేబినెట్‌లోనే ఉన్న భూమా అఖిలప్రియ మాటేంటని కొంతమంది డౌట్..బహుశా ఆమె వైఎస్సార్సీపీ కాబట్టి టిడిపి నుంచి తక్కువ వయస్సులో మంత్రి అని లోకేష్ అర్ధం అనుకోవాలేమో..మరి చంద్రబాబునాయుడు గారు కూడా చిన్నవయస్సులోనే సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు..28ఏళ్లకే..! ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఐతే ఇవేవీ లోకేష్ దృష్టిలో రికార్డు కాదేమో..అందుకే తాము చేసిన ఘనతలను కొండంతలుగా చెప్పుకోవడంలో చంద్రబాబు మంచి అందె  వేసిన చేయి అంటారు..ఇప్పుడు లోకేష్ చేసిన పని కూడా ఆ కోవకే చెందింది కాబట్టే...తండ్రికి తగ్గ తనయుడిగా చెప్తున్నారు

Comments