మెట్రో...ఇక రోడ్లు ఇలా మారతాయా!



మెట్రో రైల్ వచ్చేస్తోందంటూ కబుర్లు బయల్దేరాయ్. అసెంబ్లీ జరిగే రోజుల్లోనే ఈ ఓపెనింగ్ ఉందంటూ హడావుడి కూాడ
చేస్తున్నారు..మోడీ వచ్చే 3 రోజులు బ్రేక్ అన్నారు..మరోవైపు ఆటో డ్రైవర్లకి కూడా క్లాసులు పీకుతున్నారట..మరి
ఇన్ని జరుగుతున్నాయ్ కాబట్టి..మెట్రో రైలు ఓపెన్ అవుతుందనే అనుకుందాం..
మరి మెట్రో వస్తే ఈ ట్రాఫిక్ ఇలా ఉండదా
ఔను...ఇప్పుడిలా సాధారణంగా కన్పించే ట్రాఫిక్ అంతా మాయమవుతుందని చాలామంది నమ్మకం..కానీ అసలు నిజం మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ , తర్వాత టిక్కెట్ రేటు కూడా ముఖ్యమే..ఓసారి సరదాగా టాప్ ఏంగి‌ల్ నుంచి సిటీని చూడాలని అనుకుంటే ఓకే..! అదో అనుభూతి కింద మిగులుతుంది..కానీ అవసరం లేని  రూట్లలో పదే పదే తిరగడం కుదరదు కదా..ట్రాఫిక్ అంతా మాయమైపోతే..మరి వీటి సంగతి ఏం కావాలి
ట్విన్‌సిటీస్‌లో ఇలాంటి బస్సులు బోలెడన్ని తిరుగుతున్నాయి నిజంగా మెట్రో సక్సెస్ అయితే, వీటికి భారీగా చిల్లుపడ్డట్లేగా..ఇది మరీ నెగటివ్‌గా ఆలోచిస్తున్నానంటారా..ఓకే ఓకే.. నో ప్రాబ్లెమ్..దేని ట్రాఫిక్ దానికి ఉంటుంది లెండి..మరి వీళ్ల సంగతి ఏంటి..ఇప్పటిదాకా జనంపైకి దూసుకొచ్చి..లేడీస్ కన్పిస్తే చాలు లొట్టలేసుకుంటూ తల మలుపుతూ..జుగుప్సాకరమైన సైగలు చేస్తూ...హార్న్ కొట్టే ఈ ఆటోవాలాల పరిస్థిత ిఏంటి మరి
ఏముంది..సరదాగా ఇప్పట్లానే ముందో ముగ్గురిని వెనకో ముగ్గురిని ఎక్కించుకుని మెట్రో స్టేషన్ల దగ్గరకి సవారీ కడతారు..అంతేనా..ఎస్..
సో..ఇక మెట్రో ఆగమనంతో రోడ్లన్నీ ఇలా మారతాయా.
 అవ్వొచ్చు...
చూద్దాం..

Comments