ఏంటీ పైత్యం..తెలుగా...తెగులా..!


ఏదో పెద్ద తెలుగుని ఉధ్దరిస్తున్నట్లుగా కొంతమంది పదాలను ఛండాలంగా ప్రయోగిస్తుంటారు. దానికి పేరు పొందిన దినపత్రికలే ఎక్కువ ఊతమిస్తుంటాయి కూడా! వాడుక భాషలో చాలా  పదాలు, మాటలు తెలుగులో కలిసిపోయాయి..వాటినేదో కొత్తగా తెలుగులోకి అనువాదం చేసామనో..ప్రామాణికంగా తామే రాయాలనో కానీ..కొన్ని ప్రయోగాలు చేస్తుంటాయ్ అలాంటి వార్తనే కింద చూడండి
గగనసఖి అట...అంటే విమానంలో ఆమె ఏమైనా మనకి సఖిలా వ్యవహరిస్తుందా..లేక స్నేహితురాలా...ఏదో పదం కనిపెట్టామనే తాపత్రయం తప్ప..ఇందులో ఔచిత్యం ఎక్కడుంది. ఎయిర్ హోస్టెస్ అంటే అర్ధమవుతుంది కదా..అర్ధం కానివాళ్లకి అర్ధమైనవాళ్లు ఎటూ చెప్తారు. పైగా ప్రయాణీకులు ఎక్కేందుకు విమానాన్ని సిధ్దం చేస్తున్నారట..అసలు ఇంత గొప్పగా వాక్యం రాయడాన్ని ఎలా చూడాలో( మీడియా భాషలో) అపోలో ఆసుపత్రి అన్నారు కదా..అపోలోకి కూడా చేతిలో కాగడా మహిళ అనో ఇంకోటో అనువదించాల్సింది.. పరిస్థితి విషమిస్తే..కానీ మెరుగైన వైద్యం అందిచరనే అర్ధంలో ఇంకో వాక్యం...పరిస్థితి విషమిస్తే..అత్యవసర చికిత్స..అవసరమైన చికిత్స..నిద్రాహారాలు మాని..ఇలాంటి పదాలు వాడతారు..లేదంటే శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనే పదం వాడాలి..ఐనా..వీళ్లని అని ప్రయోజనం లేదు

Comments