సూర్యుడికో నమస్కారం


ఆహా! మన సంప్రదాయాలు ఎంత గొప్పవి! మనం ప్రతి చెట్టుని పూజిస్తాం..ప్రాణికి మొక్కుతాం(మనిషిని గౌరవించం అదిఇంకో సబ్జక్ట్) ప్రకృతిని పూజించడంలో మన భారతీయులకు సాటిలేరు. అందుకే ఇది వేదభూమి అయింది. కర్మభూమి అయింది. ప్రకృతి శక్తులను ఆరాధించడంలో వాటినుంచి ప్రతిఫలాలు పొందడంలో మనలని మించినవారు లేరు. ఇప్పుడు కార్తీకమాసం సంగతే చూసుకంటూ చాట్ పూజతో సూర్యనమస్కారం చేస్తుంటే ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అన్పిస్తుంది

ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యపాదాలివ్వడం, సంధ్యావందనం కొన్ని వర్గాలే చేసినా..వాటిలో సమస్తజీవకోటికి ప్రాణమిస్తోన్న భాస్కరునికి కృతజ్ఞత చూపడమే! ప్రపంచంలోని జీవరాసులకు శక్తినిస్తోన్న సూర్యదేవుడికి పూజ చేసి పూలు, ద్రవ్యాలు సమర్పించడం చేస్తుండటంతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కొత్త శోభ సంతరించుకుంటోంది. కావాలంటే ఉదయాన్నే ఓసారి చూడండి..మన మేలుజవ్వనిలు కొంగు సవరించుకుంటూ చాట్ సమర్పించడం ఎంత కన్నులపండుగగా అన్పిస్తుందో మారే ఋతువులకు అనుగుణంగా వచ్చే వాతావరణ మార్పులను తట్టుకోవడానికి కూడా ఈ అలవాట్లు చాలా మేలు చేస్తాయి. అందుకే ఉత్తరాదిన మాత్రమే కన్పించే ఈ పూజలు ఈ మధ్యన గోదావరి హారతి, కృష్ణా హారతి పేరుతో తెలుగునేలపై కూడా కన్పిస్తుండటం మంచిని ప్రోత్సహించడమే

Comments