జగనైతే ఓకే !..ఆ ఇద్దరి గురించి మాత్రం వద్దు


ఏపి సిఎం చంద్రబాబు విదేశాలనుంచి రాగానే నేరుగా మొదలెట్టేశారు. ఆయనకి ఖచ్చితంగా టివి ఛానళ్లు ఎప్పుడు బులెటిన్లు మొదలుపెడతాయో, తాను ఎప్పుడు మాట్లాడాలో క్లియర్ గా తెలుసు..అందుకే విదేశాల్లో తానేం సాధించుకువచ్చిందీ చెప్పేశారు. పనిలో పనిగా తన మనసులో అమరావతికి ఏమేం చేయాలనుందో కూడా స్పష్టం చేశారు(  ఈనాడు, జ్యోతి భాషలో). లండన్ రేంజ్ ట్రాఫిక్ సిస్టమ్, పామ్ అగ్రికల్చర్ అంటూ మాబోటివాళ్లకి అర్ధం కాని
చాలా మాటలు చెప్పారు. ఐతే అసలు విషయం మాత్రం చాలా క్లియర్‌గా క్లారిటీతో కుండబద్దలు కొట్టారు..అదే వైఎస్ జగన్ టాపిక్‌ ఆయన దృష్టిలో జగన్ పనికిరాడు...దేనికీ కూడా ! ఏ విషయంపైనైనా కోర్టుకి వెళ్లకూడదని చంద్రబాబుగారి ఉద్దేశం కావచ్చు..సదావర్తి భూములపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పోరాటం వల్లనే ఖజాానికి కనీసం 30  కోట్లు ఎక్కువ వచ్చిందన్నది ఆయన దృష్టిలో తప్పు..దానివలన లేనిపోని తలనొప్పులే వచ్చాయట. ఇక పోలవరం కాంట్రాక్టర్‌కి వ్యతిరేకంగా ప్రభుత్వం పని చేయడం లేదని..తొందర్లోనే పూర్తి చేస్తామంటున్నారాయన. ట్రాన్స్ స్ట్రాయ్ వద్దని సాక్షాత్తూ ప్రభుత్వమే కేంద్రానికి చెప్పిందని ప్రచారం జరిగింది. కాబట్టి..ఇప్పుడా ప్రచారం నిజం కాదని చంద్రబాబు మాటల ద్వారా తెేలిపోయింది. సో...రాయపాటి సేఫ్ అన్నమాట. ఇంత మాట్లాడిన చంద్రబాబు..రెండు విషయాలు మాత్రం దాటేశారు
 

అవి రేవంత్ రెడ్డి ఎపిసోడ్..ఇంకోటి నామా నాగేశ్వర్రావ్ బెదిరింపుల వ్యవహారం..పార్టీ అధినేతగా ఆయన హక్కుంది..ఇదే ఇంకే ఇతర పార్టీల నేతలో దొరికిపోతే..ఉతికి ఆరేయకుండా ఉంటారా..! ఆయనకి అతి సన్నిహితంగా మెలిగిన మాజీ ఎంపి ఇలాంటి స్కూప్‌లో ఇరుక్కుపోవడంపై కనీసం స్పందించకపోవడం విడ్డూరమే..ఏదైనా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడి దృష్టి అంతా అమరావతిని మాహిష్మతి రేంజ్‌కి తీసుకెళ్లడంపైనే ఉందనుకోవాలి..అప్పటిదాకా ఇలాంటి చిల్లర విషయాల  జోలికి పోకపోవడమే మంచిది

Comments