నెలరోజుల్లోపు వందకి 18రూపాయల లాభమిచ్చే ఐడియాలు


మూడీస్ రేటింగ్‌తో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ బంపర్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఐతే 10,344-10368 పాయింట్ల మధ్యలో బలమైన రెసిస్టెన్స్ ఎదురవుతోంది..ఐనా నిఫ్టీ మాత్రం 10,200 పాయింట్లనే మార్క్‌ కోల్పోవడం లేదు.  నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్‌లో డైవర్జెన్స్  కన్పిస్తోంది..ఇది సూచీల్లో కరెక్షన్‌ని సూచిస్తుంది. అదే సమయంలో వివిధ బ్రోకరేజీ సంస్థలు..అనలిస్టులు కొన్ని స్టాక్స్ ‌ట్రేడింగ్  ఐడియాలు ఇస్తున్నారు. వాటి ప్రకారం ట్రేడింగ్ చేస్తే కనీసం 18-20శాతం వరకూ లాభపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు
ఎస్ఎంసి గ్లోబల్ ఇండౌకౌంట్ ఇండస్ట్రీస్‌ని కొనమని సూచిస్తోంది
ఇండోకౌంట్ ఇండస్ట్రీస్(ICIL): కొనండి| టార్గెట్ రూ.150| స్టాప్‌లాస్ రూ.115  | టైమ్: 1-2 నెలలు  | 18శాతం రిటర్న్
శుక్రవారం ట్రేడింగ్‌లో రూ.127.80 దగ్గర క్లోజైన ఇండోకౌంట్ రెండు నెలల క్రితం
అంటే సెప్టెంబర్ 27న 93.70 రూపాయలకు కూడా పడిపోయింది. ఈ ఏడాది మే నెలలో  52వారాల రరిష్టమైన రూ.210.05కి ఎగసింది..అక్కడ్నుంచి పడుతూ..లేస్తూ..ప్రస్తుత ధరకి చేరింది. 200 రోజుల ఎక్స్‌పొనెన్షియల్ యావరేజ్ మాత్రం రూ.143.64గా ఉండటం గమనార్హం..అంటే ఈ స్టాక్ ఆ రేటుపైన సులభంగా చేరుతుందని అంటున్నారు..అందుకే  ఇప్పుడు రూ.125 దాటింది కాబట్టి ఒకటి రెండు నెలల్లోనే రూ.150 మార్క్ ని టచ్ చేస్తుందని ఎస్ఎంసి గ్లోబల్ అంచనా. స్టాప్ లాస్ మాత్రం రూ.115గా పెట్టుకోవాలని సూచిస్తున్నారు
మహీంద్రా అండ్ మహీంద్రా : కొనండి| టార్గెట్ రూ.1550| స్టాప్‌లాస్ రూ.1340| టైమ్: 1-2నెలలు| రిటర్న్స్ 9శాతం |
నవంబర్ 17న రూ. 1,416.75 వద్ద ముగిసిన మహీంద్రా అండ్ మహీంద్రా 52వీక్స్ హై రూ.1141.40 52వీక్స్ హై రూ.1458.95 ...ఈ స్టాక్ ఎక్స్‌పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ రూ.1339.40పైసలు..అంటే ఈ 200రోజుల ఈఎంఏ కంటే పైనే స్టాక్ క్లోజైందన్నమాట. షార్ట్ టర్మ్, లాంగ్‌టర్మ్‌లోనూ ఎం అండ్ ఎం పాజిటివ్‌గానే ఉన్నట్లు చార్ట్స్ చెప్తున్నాయ్. రూ.1150-1450 మధ్య కన్సాలిడేట్ అవుతూ వస్తోన్న ఈ షేరు కంటిన్యూషన్ ట్రైయాంగిల్ ప్యాట్రెన్ ను వీక్లీ ఛార్ట్స్ లో నమోదు చేస్తోంది.ఇలాంటి ప్యాట్రెన్స్ నమోదు చేసిన షేర్లకి బయ్ సిగ్నల్ వస్తున్నట్లు లెక్క
ఇక మిగిలిన ఆర్ఎస్ఐ, ఎంఏసిడి సిగ్నల్స్ కూడా స్టాక్‌ని కొంటే ర్యాలీ కొనసాగించే అవకాశాలే ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయ్. అందుకే రూ.1340 స్టాప్‌లాస్‌తో రూ.1520-1550 టార్గెట్లుగా పెట్టుకుని స్టాక్‌ని రూ.1395-1400 మద్య కొనొచ్చని ఎస్ఎంసి గ్లోబల్ సూచించింది
బ్రోకింగ్ ఫర్మ్: ఏంజెల్ బ్రోకింగ్ ప్రవేట్ లిమిటెడ్
అనలిస్ట్: సమీత్ చవాన్, చీఫ్ టెక్నికల్ డెరివేటివ్స్ అనలిస్ట్
మైండ్‌ట్రీ: కొనండి| టార్గెట్ రూ.542| స్టాప్‌లాస్ రూ.502| టైమ్-14-21 సెషన్స్| రిటర్న్స్ 5శాతం
ఏంజెల్ బ్రోకింగ్ గత రెండు నెలలుగా మైండ్‌ట్రీపై పాజిటివ్  ఔట్‌లుక్‌తో ఉంది. రూ.445వద్ద డైలీ ఛార్ట్స్‌లో అక్యుమలజేషన్ ప్యాట్రెన్‌నుంచి బ్రేక్ అవుట్ కన్పించింది ఈ కౌంటర్‌లో. వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయ్. అందుకే ప్రస్తుత రేటులో కొంటే 14-21 సెషన్లలో అంటే ఓ నెలలోపు రూ.542వరకూ స్టాక్ పెరగొచ్చని అంచనా..స్టాప్‌లాస్‌ని రూ.502గా పెట్టుకోవాలని సూచించింది ఏంజెల్ బ్రోకింగ్.
సన్ ‌టివి: కొనండి| టార్గెట్ రూ.930| స్టాప్‌లాస్ రూ.806| టైమ్ 14-21 సెషన్స్| రిటర్న్స్ 11శాతం
ఈ మధ్యకాలంలో  మంచి జూమ్ కన్పించిన సన్‌టివి కౌంటర్‌లో తాజాగా కరెక్షన్ చోటు చేసుకుంది. గత బ్రేక్ అవుట్ పాయింట్ల దగ్గరే మూడు రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నట్లు కన్పిస్తోంది. ఇదో పుల్ బ్యాక్ మూవ్‌లా చూస్తే,  ప్రస్తుతం రేటు దగ్గర కొని రూ.930 టార్గెట్‌ పెట్టుకోవచ్చని అనలిస్ట్ సూచన. స్టాప్ లాస్ రూ.806కాగా..టైమ్ ఫ్రేమ్ 14-21 సెషన్లు..అంటే మూడు వారాలు
హీరోమోటోకార్ప్: అమ్మండి| టార్గెట్ రూ.3480| స్టాప్‌లాస్ రూ.3731| టైమ్-5-10సెషన్స్| రిటర్న్స్ 4%
సెప్టెంబర్‌ వరకూ మంచి ర్యాలీ నడిచిన ఈ కౌంటర్లో కరెక్షన్ ఫేజ్ నడుస్తోంది.రూ.3700 రేటు వద్ద నెక్‌లైన్  ప్యాట్రెన్ ఫామ్ అవడంతో తిరిగి డౌన్ ఫాల్ మొదలైనట్లు కన్పిస్తోంది. అందుకే హీరోమోటోకార్ప్ ఇంకొన్ని రోజులు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటోేందని అనలిస్ట్ అంచనా వేసారు. ప్రస్తుత ధర వద్ద అమ్మి రూ.3480 వద్ద కవర్ చేయొచ్చని సూచిస్తున్నారు. అది కూడా రాబోయే 5-10 సెషన్లవరకే..సెల్ కాల్స్ కి ఖచ్చితమైన స్టాప్‌లాస్ మెయిన్‌టైన్ చేయాలి, ఈ స్టాక్ రూ.3731 అనేది స్టాప్‌లాస్ పెట్టుకోవాలని
సమీత్ చవాన్ సూచించారు

Comments