సెక్సీ జూలీ2 కథ ఈమెదేనా..?



జూలీ2 పేరుతో వస్తోన్న సినిమాలో లక్ష్మీరాయ్(రాయ్ లక్ష్మి-- ఏ రాయైతేనేం పళ్లూడగొట్టుకోవడానికి) సెక్సీ ఫోజులతో జనం మతి పోగొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ సిినిమాకి మంచి హైప్ తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకప్పటి డైరక్టర్ పెహ్లజ్ నిహ్లానీ ఇవాళే ఓ చిన్నసైజు పబ్లిసిటీ జిమ్మిక్కు ఒకటి చేసాడు..
ఈ సినిమా 1990-2000 మధ్య షైనైన ఓ లేడీ స్టార్ కథే అంటూ హింట్ వదిలాడు.

పైగా ఆమె పేరు చెప్తే సినిమా ఆగిపోతుందట. ఫస్ట్ హిందీ మూవీ చేసిందట..తర్వాత తమిళ్. తెలుగు సినిమాల్లో క్లిక్కైందట..ఇంతకు మించి హింట్ కావాలా..ఇంకెవరూ భారీ ఊరువుల నగ్మానే! ఈ మాట మనం అనగానే..కాదు కాదు అనొచ్చుకానీ..అతగాడు చెప్పిన లెక్కల్లో సూపర్ స్టార్ల పక్కన కూడా చేసిందీ బ్యూటీ. అప్పట్లో ఫస్ట్ ఫిల్మ్ యల్‌గార్‌లో సంజయ్ దత్ పక్కన బికినీలో కేక పుట్టించేసింది.

ఐతే అది వాయిదా పడుతూ 1992లో రిలీజ్ అయింది.. దానికంటే ముందే బాఘీలో సల్మాన్‌ఖాన్‌తో నటించింది. ఆ తర్వాత నాగార్జునతో కిల్లర్..అంతకుముందు సుమన్‌తో పెద్దింటల్లుడు లాంటి సినిమాల్లోమంచి పేరు తెచ్చుకుని అందరి కళ్లలో పడి టాప్ స్టార్ రేంజ్ కి చేరుకుంది.
సీన్ ఇక్కడ కట్ చేస్తే..కొన్నాళ్ల తర్వాత నగ్మా సినిమాల్లేక భోజ్‌పురికి పోయింది..అక్కడ రవికిషన్‌(రేసుగుర్రం విలన్)తో లవ్వాట కూడా ఆడింది. కింద ఓ ఫోటో చూడండి..అతనితో సినిమాల్లో అయినా ఎంత ఇంటిమసీ ఉంటే ఇలాంటి సీన్లు చేయగలదు


.తర్వాత కాంగ్రెస్ నుంచి ఎంపి అయింది.ఇప్పుడు తమిళనాడు కాంగ్రెస్ ‌కి మంచి గ్లామర్ క్యాంపైనర్‌గాఉంది..ఇదీ స్తూలంగా ఆమె కథ.
ఇలాంటి కథని జూలీ2గా తీయడమంటే..పెద్దగా మసాలాలు దట్టించకుండానే రంజింపజేయవచ్చు..ఐతే ఎక్కడా ఆమె పేరుచెప్పబోమంటున్న పెహ్లాజ్ ఆ ప్రస్తావన ఇప్పుడు  మాత్రం  ఎందుకు చేస్తున్నాడంటే సింపుల్...మనిషికి క్యూరియాసిటీ అనే జబ్బు ఉంది కదా..దానికోసమైనా...ఏ హీరోయిన్ కథ..అదెలాంటి మలుపులు ఉన్నాయ్అనే ఆసక్తితో థియేటర్లకి పరుగులు తీస్తారని అంతే..!

Comments