చంద్రబాబు శ్రీకృష్ణదేవరాయలా..ఏం పోలిక్ బాస్


ఏపి సిఎం టిడిపి ఎమ్మెల్యేలకు శ్రీకృష్ణదేవరాయల్లా కన్పిస్తున్నాడట..అసెంబ్లీ సెషన్స్‌లో గోనుగుంట్ల సూర్యనారాయణ
అనే ఎమ్మెల్యే ఈ మేరకు తన స్వామిభక్తి చాటుకున్నారు. అసలు సమయానికి ఏదీ తట్టకకానీ..నిజానికి ఆయన మనసులో మాట ప్రకారం చంద్రబాబు సీమజిల్లాల కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవదూత..అందుకే పదేళ్లకోసారి మాత్రమే నిండే చెరువులు..ఇప్పుడు  బాబుగారి హయాంలో బాగా నిండాయంటూ పొగడ్తల్లో ముంచెత్తేశారు..

అటు చంద్రబాబుగారికి అసెంబ్లీలో ఎక్కడలేనంత వెసులుబాటు దక్కడంతో చక్కగా సమస్యలు పరిష్కరిస్తూ దూసుకుపోతున్నారు..ఐతే  ఆయన ఫాలోయర్లు మాత్రం ఇలా  చెక్కభజన చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటే ఉన్నట్లుండి మండుకొస్తోందట..అందుకే సిఎంగారు ప్రతి నియోజకవర్గంపై ఆయా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సూచించారని..లోకేష్ స్వయంగా ప్రకటించారు..ఈ మధ్యకాలంలో ప్రతి పంచాయితీకి వెయ్యి కోట్లరూపాయల ఆదాయం తెచ్చిపెట్టే ఐడియా లోకేష్ ఇవ్వగానే..చుట్టూ ఉన్నోళ్లంతా...మాకెందుకు రావు ఇటువంటి ఆలోచనలు..ఛ..మా బతుకు అని చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు బాధపడుతున్నారట..ఒక్క గ్రామానికే వెయ్యికోట్లు..ఇక సిటీలకు పదివేలకోట్లు..ఇలా లక్షకోట్ల  ఆదాయం ఒక్కనెలకే వచ్చి పడుతుందని..ఆ తర్వాత ఆ డబ్బులంతా  ఏం చేయాలో కూడా తెలీనంత బిజీగా రైతులు అయిపోతారని కొంతమంది  కామెడీ చేస్తే చేయొచ్చుకానీ..అటు చంద్రబాబుగారు కానీ..ఇటు లోకేష్ కానీ ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు..పని..పని..పని..ఇదే వాళ్ల ఫోకస్..మరి అలాంటి లీడర్లని ఎమ్మెల్యేలు కృష్ణదేవరాయలేం ఖర్మ దేవుడితోనైనా పోల్చే హక్కు వారికుంది మరి

Comments