మాంసం తినలేదా ఐతే మీకో గోల్డ్ మెడల్ గ్యారంటీ


సావిత్రీఫూలే బాయ్ పూనే యూనివర్సిటీలో అచ్చంగా ఇలాంటి మరో పది కండిషన్స్  అప్లై చేస్తే చాలు గోల్డ్ మెడల్‌కి అప్లై చేసుకోమని సర్క్యులర్ తన వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసింది. ఐతే ఇలాంటి నిబంధనలతో తనకి సంబందం లేదని..సదరు గోల్డ్‌మెడల్‌ని ఎవరైతే స్పాన్సర్ ‌చేస్తున్నారో ..ఆ కుటుంబమే ఇలాంటి రూల్స్ పెట్టిందని స్పష్టం చేసింది. త్యాగ్ మూర్తి, శ్రీమతి సరస్వతి రామచంద్రషేలా పేరుతో ఏర్పాటైన సదరు గోల్డ్‌మెడల్ సైన్స్, నాన్-సైన్సల్ కేటగరీ పీజీ స్టూడెంట్లకి పూనే యూనివర్సిటీలో పురస్కారాలు ప్రదానం చేస్తోంది. దానికి విధించిన నిబంధనలు విధివిధానాలు ఇలా ఉన్నాయ్.
మాంసాహారం తిననివారు, యోగా చేసేవారు, ఆల్కహాల్‌కి దూరంగా ఉండేేవారు, భారతీయ సంస్కతిని పాటించేవారు
హైఐవి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నవారు, ఇలా ఇంకా కొన్ని నిబంధనలను పాటించగలిగిన వారు తమ గోల్డ్‌మెడల్‌కోసం ధరఖాస్తు చేసుకోవచ్చుంటూ ప్రకటించారు. ఆ నోటిఫికేషన్ పూర్తి ఫోటో కింద చూడండి

ఇలాంటి నిబంధనలు పెట్టడం ఖచ్చితంగా విద్యార్దులకు కాషాయం రంగు పులమడం కోసమే  అని కొంతమంది మండిపడుతున్నారు.  దీనిపై యూనివర్సిటీ రిజిస్ట్రార్, విసిలను కలిసేందుకు ఆయా విద్యార్ది సంఘాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయ్.


Comments