రామజన్మభూమిలో రవిశంకర్‌కి ఏం పని?


రాముడు పుట్టిన ప్రదేశం..కాదు బాబర్ కట్టిన మసీద్ ఇలా ఏళ్ల తరబడి సాగుతోన్న వివాదం గతంలో అంత టెన్షన్ అయితే కలిగించడం లేదు. అసలు కేసులు పెట్టిన ఇద్దరూ కూడా మంచి దోస్తీ కట్టిన సందర్భాలు ఉన్నాయ్. మళ్లీ దాన్ని పొలిటికల్ మైలేజీ కోసం అయితే ఎవరైనా రెచ్చగొడితే రెచ్చగొట్టొచ్చు కానీ పరిస్థితులు ఇప్పుడు గతంలో అంత సెన్సిటివ్‌గా లేవు. కోర్టులు కూడా ఓరకంగా అక్కడ వందలఏళ్లక్రితం రాముడికి పూజలు జరిగిన ఆనవాళ్లే ఉన్నాయని పరోక్షంగా వ్యాఖ్యలు కూడా చేసింది..ఐతే కేసుని మాత్రం అలా కొనసాగిస్తూనేఉంది. హిందువుల దేశంలో వలస వచ్చిన వారి పాలకుల ముద్ర వేస్తే వేసి ఉండొచ్చు కానీ అంతకుముందు హిందువుల పూజలు , దేవాలయాలు లేకుండా ఉండటం సాధ్యం కాదు.
పరిస్థితి ఏదైనా..ఇప్పుడు శ్రీశ్రీ పేరుతో ప్రపంచానికి శాంతిదూతలా ప్రవచనాలు చెప్పే రవిశంకర్ వెళ్లబోతున్నాడు..తానే అన్నివర్గాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపిస్తానంటూ బయల్దేరాడాయన. బెంగళూరులో ఆయన బోదనలు చెప్పకుంటున్నంత కాలం ఎవరూ ఆయన జోలికి పోలేదు. ఎప్పుడైతే ఇందులో వెేలెట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టాడో..బిజెపి వర్గాలనుంచి కూడా కాస్త నిరసన స్వరాలు మొదలయ్యాయ్. ఈయనకేంటి మధ్యలో..ఈయనకి ఉన్న అర్హత లేంటి అనేవే అవి. జెఎన్‌యూ ఢిల్లీలో ప్రసగించిన ఆయన అక్కడి పొల్యూషన్ పై కూడా తన కన్సర్న్ చూపించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని తాను పరిష్కరిస్తా అని చెప్పడం ఎంతవరకూ కరెక్టో తెలీదు కానీ..ఈయన తన బెంగళూరు ఆశ్రమం కోసమే పార్కింగ్‌ కోసం తీసుకుని తర్వాత ఆక్రమించుకున్నారని..ఆరోపణలున్నాయ్ కేసులూ ఉన్నాయ్. అలాంటప్పుడు దేశాన్ని కుదిపేసిన కేసుని పరిష్కరిస్తా అనడం కాస్త విడ్డూరమే. ప్రచార పటాటోపమే కన్పిస్తుంది తప్ప ఈయనకి ఆ స్థాయి  లేదనేవాళ్లూ ఉన్నారు..ఎలాగైతేనేం ఈ మధ్య స్వాములు( వాళ్ల పేర్లని బట్టి), సన్యాసులుకూడా పాలిటిక్స్‌, పాలిటిక్స్ సంబంధిత అంశాలపై బాగానే ఉత్సాహం చూపుతున్నారనుకోవాలి. 

Comments