రిలాక్స్..రాజశేఖర్! బట్ నువ్వే తోపు అనుకోవద్దు నీలాగే కృష్ణ, శోభన్ కూడా!


గరుడవేగా..హిట్టో..ఫ్లాపో కాదు గానీ..రాజశేఖర్ సిినిమాల రేంజ్ కూడా పెరిగిపోయిందనేది ఈ సినిమా తేల్చేసింది..దాంతో రాజశేఖర్ కూడా రిలాక్స్ ఐపోవచ్చు..కానీ ఆడియో ఫంక్షన్లు..ప్రమోషన్ ఈవెంట్లలో అనవసరంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఈ వయసులో దెబ్బమీద దెబ్బ పడటం తట్టుకోవడం కష్టమే కానీ, ఓ డాక్టర్ కూడా అయిన రాజశేఖర్ గత తారలను చూసైనా కొన్ని విషయాలు నేర్చుకోవాలి


ఇప్పుడు రాజశేఖర్ ఎదుర్కొన్న స్థితి అంతకు ముందు అందరూ ఎదుర్కొన్నదే..ఇంకా నయం ఇతగాడికి కనీసం పాతికేళ్ల కెరీర్  అన్నా ఉంది..జగపతిబాబు, శ్రీకాంత్, తరుణ్, రాజా..ఇలా చాలామంది పదేళ్లకి మించి వెలగలేకపోయారు..కానీ అంతకు ముందటి సూపర్ స్టార్లు..కృష్ణ, శోేభన్‌బాబు కూడా చివరిదశలో ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నారు..సక్సెస్‌ఫుల్‌గా తమ కెరీర్‌ని ముగించేశారు..కృష్ణ అంటే వేరు..ఆయనకి ఉన్న అభిమానగణం ఎన్ని ఫ్లాపులొచ్చినా ఆయన్ని హీరోగానే చూశారు..ఆఖరికి క్యారెక్టర్ యాక్టర్‌గా చేసినా...ఓ హీరోఅంత స్థాయి ఉందేమో అన్నట్లుగానే థియేటర్లకి వెళ్లారు..అలా హిట్లూ..ఫ్లాపులతోనే యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేశారు..అలా అయినా మళ్లీ శ్రీశ్రీ అంటూ పలకరించారు..హిట్టో..ఫ్లాపో వదిలిపెడితే సినిమా అంటే ఎంత ప్యాషనో తెలియజేశారు.

శోభన్ బాబుదీ అదే స్థితి..ఐతే ఈయన తన మార్కెట్ సంగతి పక్కనబెట్టి..అన్నీ హీరో రేంజ్ క్యారెక్టర్లే చేస్తానంటూ భీష్మించుకోవడంతో చివరిదశలో అట్టర్‌ఫ్లాప్‌లతో కెరీర్ ముగిసిపోయింది..

ఆ తర్వాతే ఇక నటించనంటూ శపధం చేసి చెన్నైలో ఉండిపోయారు..అంత మాత్రాన సినిమాలే నా ప్రాణం..ఆస్తులన్నీ అమ్ముకుంటా అని ఏనాడూ రాజశేఖర్‌లాగా చేసింది లేదు. ఎక్కడా కళ్లనీళ్లు పెట్టుకుందీలేదు.

.ఇదివరకంటే పాతికేళ్ల కెరీర్ ఉండేది..ఇప్పుడు పదేళ్లకే ముసలిహీరోలని ఏంటి చూసేదన్నట్లుగా..ఆడియెన్స్ తమ ఫోకస్ షిఫ్ట్ చేసేస్తున్నారు..ఐతే ప్రతి ఒక్కళ్లూ పవన్ కల్యాణ్‌లు, మహేష్ బాబులు కాలేరు..అందుకే జగపతిబాబు తెలివిగా తన క్యారెక్టర్లు తాను చేసుకుంటూ డబ్బు చేసుకుంటున్నాడు..ఆయనో హీరో కాబట్టి మనకి అతను చేసే చిన్న క్యారెక్టరైనా బూతద్దంలో పెట్టి చూస్తున్నాం కానీ..కొన్ని పాత్రలు అయితే మరీ సోదివి కూడా ఉన్నాయ్(లింగా, కరెంట్ తీగ)

అందుకే ఫ్యాన్స్ ఏం చెప్తున్నారంటే డియర్ రాజశేఖర్ అనవసరంగా ఎమోషన్ అవకు..ఆరోగ్యం పాడుచేసుకోకు..నిజంగా దమ్మున్న క్యారెక్టర్..నీ వయస్సుకి తగినది వస్తే...ఇరగదీయ్..లేకపోతే క్రియేట్ చేసుకో..అంతేగానీ..సినిమాలు లేవని ఆస్తులు అమ్ముకోకు..డిప్రెషన్‌లోకి పోవద్దు..ఎందుకంటే కొత్తనీిరు వస్తుంటే..పాతనీరు కిందకి పోవాల్సిందే..అందులో తిరుగులేదు..అది ప్రకృతి సూత్రం

Comments