జోహార్ వర్మా...ఇప్పటిదాకా రామూ సైటైర్స్‌లో ఇదే టాప్


నంది అవార్డులపై మనం రాతలు ఆపాలనుకున్నా..సినిమా జనం మాత్రం తమ వారాఫ్ వర్డ్స్ ఆపడం లేదు. ఇక సినీ జనం ఎప్పుడు  దొరుకుతారా..అంటూ వెంటాడే వేటగాడు బాజీగర్ రామ్ గోపాల్‌వర్మ అయితే ఏకంగా పాటనే సెటైర్‌గా మార్చి ఇరగదీశాడు. ఇది ఇప్పటిదాకా రామూ వేసిన సెటైర్లలో టాప్ గా చెప్పుకోవాలి. మామూలుగా సినిమా జీవులు..సాటి జీవులని పెద్దగా గెలకరు..కానీ రామూ మాత్రం సినిమాజనాన్నే వెంటాడి వేధించి..తన కసి(సరదా) అంతా తీర్చుకుంటాడు..అలానే ఓ పాట ఇలా అల్లేశాడు...పోస్ట్ చేశేసాడు చూడండి
 ఈ కింద పాట పూర్తి వాక్యాలు ఉన్నాయ్...అన్నిటికిందా వీడియో ఉంది చూసి ఎంజాయ్ చేయండి
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఎవరికి ఇవ్వాలి అవార్డు.. ఇక ఊపండి బాబు గిచ్చుడు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
ఎహే..వేయకే నీవు రంకెలు.. నీ కన్నా గొప్పది సైకిలు, నీ కన్నా గొప్పది సైకిలు
గంగిరెద్దు లాగనన్ను చిన్నచూపు చూడకండి.. ఆ.. ఆ.. అమ్మోయ్..
గానుగెద్దు లాగనన్ను అక్కడక్కడే తిప్పకండి.. అబ్బ.. అబ్బ.. అబ్బో..
అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు.. అయ్.. అయ్..
అహ్.. తట్టుకోలేను మీ విసురు... తగులుతుందయ్యో నా ఉసురు..
అడ్డువచ్చువాడు లేడు మాకు... పచ్చ జెండా ఊపుతాము మేము, పెద్ద పచ్చజెండా ఊపుతాము మేము
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని.. అయ్యో ఒకటే నేను నందిని..
సామి భక్తి కోసమేనా... ఇంత పెద్ద నంది కష్టం..
ఇష్టంవచ్చి నట్టుమీరు పంచుకోవడం మాకు ఇష్టం.. అబ్బ.. అబ్బ.. అబ్బబ్బ..
మాకు ఉన్న నొప్పులేవో మావీ.. మేము చెప్పినట్టు తల ఊపు నంది
ఇంకెందుకయ్యో ఈ నందులు.. ఎందుకో ఈ పిచ్చి చిందులు.. అబ్బ ఎందుకో ఈ పిచ్చి చిందులు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. యాహ్.

Comments