రైట్స్ ఇష్యూ...ఏది రైట్ ఏది రాంగ్


రైట్స్ ఇష్యూ...ఏది రైట్ ఏది రాంగ్
సాధారణంగా ఏ కంపెనీ షేర్లైనా షేర్ హోల్డర్లకి రైట్స్ ఇష్యూ‌లో డిస్కౌంట ్ రేట్ కి అందిస్తుంటాయ్. మరి మార్కెట్  రేటు కంటే తక్కువ వస్తుంటే ఎవరైనా వాటిని కొనుగోలు చేయాలనే అనుకుంటారు..కానీ ఈ విధానంలో ప్రతి ఒక్క కంపెనీ షేరు కొనడం శ్రేయస్కరమేనా..!?
కంపెనీలకు వ్యాపార విస్తరణకోసమో, వేరే సంస్థల కొనుగోలు అవసరాల కోసం, వ్యాపారాలు విడదీయడానికి డబ్బు అవసరమవుతుంది.దానికోసం వేరే మార్గాలుకాకుండా ఉన్న షేర్ హోల్డర్లకే సంస్థలోని వాటాల విక్రయం ద్వారా నిధుల సేకరించడం రైట్స్ ఇష్యూ.. సెక్షన్ 62(1)  2013 కంపెనీ యాక్ట్ ప్రకారం కంపెనీ కొత్త షేర్లు ఇష్యూచేయాలంటే ముందు ఉన్న వాటాదారులకు వారికి ఉన్న వాటాల నిష్పత్తిలో షేర్లు ఆఫర్ చేయాలి. ఇది వోటింగ్ రైట్స్ కాపాడటానికి చట్టం ఏర్పాటు చేసిన ఓ  రక్షణ అనుకోవాలి
ఇది ఓ హక్కు మాత్రమే తప్ప ఖచ్చితంగా రైట్స్ఇష్యూలో షేర్లు కొనుక్కోవాలనేం లేదు. ఈ రూట్లోనే షేర్ హోల్డర్లు తమ షేర్లని ఇతరులకు అమ్ముకోవచ్చు కూడా. సాధారణంగా సంస్థలు ఎకానమీ పరిస్థితి బాలేనప్పుడు ఆశ్రయించే పద్దతుల్లో రైట్స్ ఇష్యూ కూడా ఒకటి. బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేయనప్పుడు కూడా ఇలా రైట్స్ ఇష్యూకి వస్తుంటాయ్. అంటే కంపెనీలకు అప్పులు పుట్టనప్పుడు..సదరు షేరుకి డిమాండ్ లేనప్పుడు కూడాఇలారైట్స్ ఇష్యూ వస్తుంటాయ్. అందుకే రైట్స్ ఇష్యూకి అప్లై చేస్తున్నప్పుడు  ఈ కింది అంశాలు గమనించండి
అప్పులు తీర్చడానికి రైట్స్ ఇష్యూకి రావడమంటే  డెట్(డెబిట్)పై వడ్డీ భారం తగ్గుతుంది.  
కొత్త ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయడానికి
ఇతర సంస్థలను కొనుగోలు చేయడానికి
ఉత్పత్తి సామర్ధ్యం పెంచడానికి
డైవర్సిఫికేషన్

ఈ కారణాలతో రైట్స్ ఇష్యూకి వచ్చే కంపెనీల్లో అదనపు షేర్లు కొనుగోలు చేయవచ్చు
ఇక రైట్స్ ఇష్యూలోని నెగటివ్ కోణమేంటంటే, ఉన్న షేర్ల వేల్యూని డైల్యూట్ చేయడమే అవుతుంది. స్టాక్ మార్కెట్ కూడా రైట్స్ ఇష్యూ ఇచ్చే కంపెనీని ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోన్న సంస్థగానే పరిగణిస్తుంది. దీంతో షేర్ హోల్డర్లుకూడా తమ షేర్ వేల్యూ తగ్గిపోవడంపై ఆందోళన చెందడం సహజపరిణామం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలే కానీ, డిస్కౌంట్ ని చూసి అట్రాక్ట్ అవడం తగదు.

Comments