ఇక చాలు ఆపండ్రా మీ నాటకం..నంది అవార్డులివ్వరట


అవార్డులను మొత్తానికే రద్దు చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తోందట. అసలు దీనికంతటికీ ఇంకో పెద్దాయన కారణమట..ఇలా రెండు రోజుల నుంచి ఒకటే స్టోరీలు కుమ్మి పడేస్తున్నదా పత్రిక..పాపం బాబుగారి జమానాలో ఆ ఛానల్..పత్రికకి భారీగా లాభం చేకూరడంతో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికీ బేష్..సూపర్ అంటూ కథనాలు రాసుకోవడం..తప్పులేమైనా వస్తే..మిగిలినవారిపైన నెట్టేయడం(కనీసం తనకి తాను రాసుకుని ఆనందించడం) పరిపాటిగా మారిపోయింది.

నిన్న ఓ రకంగా భారీ వ్యాసమే దీనికి మద్దతుగా రాసుకున్నాడో కవికుమారుడు..తన ఊహలకు పదును పెడుతూ నంది అవార్డుల్లో కొంతమందికి అర్హత ఉన్నా..ఇచ్చేశారని..వాటికి సినిమాఇండస్ట్రీకి చెందిన , జ్యూరీకి చెందని ఆ వ్యక్తే కారణమంటూ కథనం సాగిపోియంది..వేళాపాళా లేకుండా ఆ మురళి వాయించిన మోహనుడెవరో ఆ కథనం చదివిన వారికి వెంటనే అర్ధమైపోతుంది..ఐతే ఇక్కడ ఆ స్టోరీ చూస్తే వళ్లు కంపరమెత్తక మానదు..
ఆ కథనం సంగతి పక్కనబెడితే మిగిలిన ఇఁడస్ట్రీలో నోటికొచ్చినట్లు పేలుతున్నవారి ప్రేలాపనా అంతే ఉంది..మనం ఇంతకుముందే రాసుకున్న కథనంలానే..ఆ మెగాహీరోకి అన్యాయం..మా కులానికి  అన్యాయం అంటూ తెగ వగస్తున్నారు. ఇలా మాట్లాడటానికి కనీసం సిగ్గుండదా అని జనం ఛీదరించుకుంటున్నా పట్టించుకోరు..అసలు ఇస్తే గిస్తే వీళ్లకే ఇవ్వాలన్నట్లు మెగాహీరో భజన బృందం..లేదు మావాడు కాబట్టి..వ్యతిరేకవర్గమైనా ఆ హీరోకి గొప్ప అవార్డు ప్రకటించామని చెప్పుకోవడం చూస్తుంటే దొందూ దొందే అన్పించకమానదు. ఇచ్చిన అవార్డు నచ్చకపోతే తీసుకోకపోతే చాలు..ఇంత రాధ్దాంత చేయక్కర్లేదు..పైగా మావాడు స్టార్ హీరో అని చెప్పడం ఏంటి..అలాంటప్పుడు అందులో ఆయనని హీరో కేటగరీకి అప్లై చేయాల్సింది..ఆ లెక్కన ఇంతకుముందు హీరోలు కూడా ఎప్పటికీ హీరోలే..ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తే..ఇవాళ్టి కథనం ఇంకా దారుణంగా ఉఁది.


                                        ప్రభుత్వానికి కమిటీ నిర్ణయానికి సంబంధం లేదట
               వివాదాలు వస్తాయని తెలిస్తే ఐవిఆర్ఎస్ ద్వారా నిర్ణయించేవారట
పైన కామెంట్ సదరు రెంటాల జయదేవ్ అనే రాతగాడి కోత అయితే రెండో కామెంట్ సాక్షాత్తూ ఏపి సిఎం చంద్రబాబుది. కమిటీలో ఎవరుండాలో నిర్ణయించేది ఎవరు ప్రభుత్వం..మరి ప్రభుత్వం ముందే ఎందుకు సరైన వాళ్లని ఎంపిక చేయలేదు..సరే చేయలేదు..కనీసం ఆ ప్రకటన వచ్చే ముందైనా..బాలకృష్ణ ఆ వేదికపై ఉండకుండా ఉంటే..ఈ వివాదం వచ్చేది కాదు గదా..! అంటే అవార్డులు తమ సొత్తన్నట్లు ఆ క్రెడిట్ తమకే దక్కాలన్నట్లు వ్యవహరించారు..ఇప్పుడు తీరా పరువు పోయేసరికి బాలకృష్ణ ఒక్క  అవార్డు ఎంపికకే పరిమితం.. ప్రభుత్వం కమిటీని నిర్ణయించేవరకే పరిమితం అంటూ అపరిమిత గందరగోళానికి ఎఁదుకు తెరలేపుతున్నారు. పైగా నంది అవార్డులను ఆపేస్తాం అఁటూ లోలోపల మండిపడుతున్నారంటూ లీకులెందుకు..ఇవేమైనా ప్రజాపయోగం కోసం ఇచ్చే అవార్డులా...లేదూ జనం మిమ్మల్ని కాళ్లా వేళ్లా  ఏమైనా పడ్డారా బాబూ సినిమాలకు అవార్డులు పంచండి  అని..
ప్రభుత్వ ఎజెండాని నెత్తినబెట్టుకుని మోస్తున్న ఆ పత్రిక యజమాని..అసలు ఛానళ్లు , పేపర్లు నానాయాగీ చేయడం వల్లనే ఈ వ్యవహారం ఇంత పెద్దదైందని ముక్తాయిస్తున్నారు ..మరి ఆ గొప్ప విజ్ఞాని తన ఛానల్‌లో మాత్రం ఎందుకు భారీ ప్రహసనం నడిపించాలి..అంటే మనం చేస్తే...... ఇవతలి వారు చేస్తే..........అనా? పైగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో వీరిిికి చోటు కల్పిస్తే సరి అంటూ ఉచిత ప్రసాదం పంపిణీ చేయడమెందుకు..అవార్డు వస్తే అంతా సక్రమం..లేకపోతే అక్రమం అంటూ గొంతులు చించుకునేవాళ్లు కూడా ఇక తమ పని తాము చూసుకుంటే చాలు..ఎందుకంటే మీ వాదనలో కులప్రయోజనం తప్ప జన ప్రయోజనం శూన్యం. గతంలో సత్యనారాయణ, కాంతారావు, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చంద్రమోహన్ ఇలాంటి ఎందరో స్టార్లు..నటులు తమకి  అవార్డు దక్కకపోతే సైలెంట్‌గానే ఉన్నారు..అస్సలా విషయాన్నే పట్టించుకోలేదు..పట్టుమని పాతిక సినిమాలు కూడా తీయని పెతోడూ ఇలా చించుకోవడం చూస్తే..విస్తరాకు సామెత గుర్తొస్తోంది. దాన్ని ప్రూవ్ చేయాలనుకుంటే ఇంకా రగడ చేయండి. ఈ విషయంలో మంత్రి లోకేష్ స్పందన కాస్తలో కాస్త బెటర్‌గా ఉంది..ఇదివరలో రానివాళ్లెవరూ ఇలా అడగలేదని అన్నాడాయన. కాస్త మంచి మాటే..ఐతే ఏపీలో నివాసం లేనివారు..ఆధార్ కార్డ్ లేనివారు అని మాత్రం అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కులం రంగేసుకున్న నంది..ఇక పొలిటికల్ రంగు కూడా పూసుకున్నట్లవుతుంది.

Comments