హైదరాబాద్‌లో బిచ్చగాడు స్టోరీ రిపీట్


హైదరాబాద్‌కి ట్రంప్ కూతురు ఇవాంకా రానుంది..దీంతో నాలుగు రోజుల ముందునుంచే హడావుడి ప్రారంభమైంది..ఇలాంటి వివిఐపిలు ఎప్పుడు సిటీకి వచ్చినా కొంతమంది మైండ్‌సెట్ మారదు..మన దేశమేదో బెగ్గర్లులేని రాజ్యంగా కన్పించాలనుకుంటారో ఏంటో కానీ..ప్రథమ, తక్షణ కర్తవ్యాల్లాగా బిచ్చగాళ్లు..యాచకులు అంటూ కన్పించకూడదంటూ ఆదేశాలు పంపించడం..ఆ తర్వాత గాలికొదిలేయడం జరుగుతుంటుంది.. గత చంద్రబాబు హయాం నుంచి..నేటి కేసీఆర్ పాలన వరకూ ఇదే తీరు. కొ్ంతలో కొంత నయం ఏంటంటే,,వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లూ లేకుండా..జస్ట్..జార్జి బుష్ రావడం ఆయన చేతిలో పేద్ద గుమ్మడికాయ పెట్టేయడం లాంటి కార్యక్రమాలే జరిపారు తప్ప..ఉన్న గూడు పోగొట్టే పనులు చేయలేదు..

ఇప్పటి కథనం విషయానికి వస్తే..రుబియా, ఫర్జానా వీళ్లిద్దరు బిచ్చగత్తెలుగా పోలీసులు అరెస్ట్ చేయడం..పునరావాస కేేంద్రాలకు తరలించడం జరిగిపోయాయ్..ఐతే ఎంక్వైేరీలో తేలిదేమిటంటే..వీళ్లిద్దరూ కరోడ్‌పతులట. ఒకరేమో లండన్ ఇంకోకరేమో అమెరికా..ఒకరు అక్కడ ఆస్తులు వదిలేసి..ఇంకొకరేమే ఇక్కడ చుట్టాలకు అప్పగించారట..మనశ్సాంతి కోసం దర్గా దగ్గర బిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారట..అచ్చంగా ఇలానే తన తల్లి బతకడం కోసం బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ అడుక్కుని డబ్బు సంపాదించే కథ గుర్తుకురావడం లేదూ..అందుకే ఏ బిచ్చగాడినీ హీనంగా చూడకూడదేమో..!


Comments