నువ్ మంత్రివైతే నాకేంటి..సెంట్రల్ మినిస్టర్‌కి నోట మాటే రాలేదు ఉతికి ఆరేసిన లేడీ డాక్టర్


టివిలో ఓ యాడ్ అప్పుడప్పుడూ పలకరిస్తుంటుంది. క్యూ లైన్లో అంతా నిలబడి ఉంటే..మినిస్టర్ గారు వచ్చారు కాసేపు ఆగండి అంటూ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ క్యూని బ్లాక్ చేస్తారు..ఐతే మేమూ టిక్కెట్ కొనేగా వచ్చాం ఎందుకు ఆగాలి ఉంటే ఓ బక్క వ్యక్తి గట్టిగా అడుగుతాడు..దీంతో సిబ్బంది క్యూని ముందుకు పంపిస్తారు..ఇలానే
నోరు తెరిచి అడగాలే కానీ చాలా పనులే జరిగిపోతాయ్.


ఇంఫాల్ ఎయిర్‌పోర్టులో ఇంతకి మించిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఫ్లైట్ ఎక్కాల్సిన టైమ్ కి రాకుండా బాగా లేట్ గా వచ్చి ఆలస్యానికి  కారణమైన సెంట్రల్ మినిస్టర్‌పైనే మండిపడిందో లేడీ..డాక్టర్ కూడా అయిన తను ఓ పేషెంట్‌కి ఎమర్జెన్సీగా ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉండగా..ఇలా చేయడమేంటని ఎగిరెగిరి పడింది.. అసలు ఇలాంటి విఐపి కల్చర్ ఎప్పుడు పోతుందని రెచ్చిపోయిందా లేడీ..సెంట్రల్ మినిస్టర్ ఆల్ఫోన్స్ కన్నన్..సర్దిచెప్పుకునే ప్రయత్నం చేయబోగా..అస్సలు ల ెక్క చేయకుండా..నువ్ మంత్రివైతే ఏంటి నాకు తొక్క అనే రేంజ్‌లో విదిలించి పారేసింది..ఇంకెప్పుడూ ఇలా జరగదని రాసివ్వండంటూ నిలదీసింది..నిజంగా నిలదీయడం అంటే ఇదీ అని ప్రూవ్ చేసింది.
ఇదే స్ఫూర్తిని కనుక ఏ తిరుమలతిరుపతి గుళ్లోనో..ఇంకోచోటనో మిగిలినవాళ్లు కూడా ఫాలోఅయితే..పొలిటికల్ లీడర్లు గగ్గోలెత్తడం ఖాయం..ఆ వీడియో మీరు కూడా చూసేయండి

Comments

  1. డాక్టర్ కే పేషెన్స్ లేదు ... ఇతరుల తప్పులకు తాను కోపం తెచ్చుకోవడం తప్పని వ్రాసి ఇస్తుందా ?

    ReplyDelete

Post a Comment