మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్స్‌ని తెగ కొనేస్తున్నాయ్. మరి మీరు?



యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి,హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ లైఫ్, భారతి ఎయిర్‌టెల్, గెయిల్, ఐటిసిి, టాటామోటర్స్ , యెస్ బ్యాంక్ సన్‌ఫార్మా  ఈ స్టాక్స్ అన్నీ ఫ్రంట్‌లైన్ స్టాక్సే..అన్నీ లార్జ్‌క్యాప్సే.. వేల్యూ  ఇన్వెస్టర్లు క్వాలిటీనా క్వాంటిటీనా అనే ప్రశ్నను తరచూ ఎదుర్కొంటుంటారు. ఐతే ప్రస్తుతం మాత్రం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తమ ఓటు లార్జ్ క్యాప్ స్టాక్స్‌కే వేశారు. డీసెంట్‌ రేట్లలో లభిస్తోన్న  ఈ షేర్లలో రూ.9వేలకోట్ల పెట్టుబడులు కుమ్మరించేశారు. ఇదంతా ఒక్క అక్టోబర్ నెలలోనే కావడం గమనార్హం.

"  లాంగ్‌టర్మ్ లో స్ధిరత్వం, అభివృధ్దికి అవకాశాలున్న ఈ స్టాక్స్‌ స్మాల్ క్యాప్ స్టాక్స్‌తో పోల్చితే చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. టాటామోటర్స్ సంగతే చూస్తే..ఈ మధ్యే డీసెంట్ కరెక్షన్‌కి లోనైన కంపెనీ షేరుగా చెప్పుకోవాలి. అందుకే అందరి చూపూ ఆ కంపెనీపై పడింది" అంటారు శాంకో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడి.
" ఆర్ధిక సేవలందించే కంపెనీ షేర్లు  ఇప్పటికీ ఫండ్ మేనేజర్లు ఫేవరిట్లే..ఆయా కంపెనీల్లో ఇంకా చాలా సంపద  ఆర్జించే సామర్ధ్యం దాగి ఉంది. అందుకే ఈ షేర్లలో కూడా  ఫండ్‌హౌస్‌లు పెట్టుబడులు పెడుతున్నాయ్." అంటారాయన
ఫండ్ హౌస్‌లో ఫేవరిట్ స్టాక్స్ చూస్తే...హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్‌బిఐ, ఎల్ అండ్ టి, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఐటిసి, మారుతి సుజికి  రిలయన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయ్.

క్యాష్ బ్యాలెన్స్ (నగదు నిల్వ)
గత పదినెలలుగా స్టాక్‌మార్కెట్‌లో మంచి ర్యాలీ నడవడంతో ఫండ్‌హౌస్‌లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయ్. చేతిలో డబ్బుతో రెడీగా ఉంటున్నాయ్. మైనర్ కరెక్షన్ చోటు చేసుకున్నా..మంచి స్టాక్స్‌లో పెట్టుబడికి ఆ అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయ్.
ఐతే సూచీలు మాత్రం ఇన్వెస్టర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వడంలేదు. ఇప్పటిదాకా మహా ఆయితే ఓ మూడు నుంచి 5శాతం వరకూ కరెక్షన్ అవడం, తిరిగి లైప్ టైమ్ హై పాయింట్లను చేరడం జరుగుతోంది. అందుకే ఫండ్ మేనేజర్లు కూడా ప్రైమరీ మార్కెట్లలోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సెకండరీ మార్కెట్‌లో షేర్ల రేట్లు బాగా ఖరీదుగా మారడంతో...ఐపీఓ ఇష్యూల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.  అందుకే వాటి నగదు నిల్వలను చూస్తే.. నాలుగు నెలల కనిష్టస్థాయికి క్యాష్ బ్యాలెన్స్ శాతం పడిపోయింది. మార్నింగ్ స్టార్ గణాంకాల ప్రకారం ఫండ్‌హౌస్‌ల  క్యాష్ హోల్డింగ్స్ 5.5శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. ఇది జూన్‌లో 5.2శాతం.. అదే జులైలో 5.6శాతం, ఆగస్ట్ లో 6శాతం కాగా..సెప్టెంబర్ లో 5.7శాతం క్యాష్ బ్యాలెన్స్ ఉన్నట్లు డేటా చెప్తోంది.

ఇక మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్  అండర్ మేనేజ్‌మెంట్ వేల్యూ రూ.21లక్షలకోట్లకిచేరడం ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహానికి అద్దం పడుతోంది. ఒక్క అక్టోబర్ నెలలోనే ఏయూఎంల వేల్యూ అదనంగా రూ.51వేలకోట్లకి పెరిగింది. సెప్టెంబర్ నెలలో  రూ.16వేలకోట్లు బైటికి పోయినా, అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం గమనార్హం. నడుస్తోన్న ఆర్దికసంవత్సరంలోని మొదటి 7నెలల్లోరూ.96వేలకోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు వచ్చినట్లు అంచనా..దీంతో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ వేల్యూ 7శాతం పెరిగి రూ.7.08లక్షల కోట్లకి చేరడం ఈక్విటీలపై జనానికి ఉన్న మక్కువని చాటుతోంది. అంతకు ముందు నెలలో అంటే సెప్టెంబర్‌లో ఈ వేల్యూ రూ.6.06లక్షలకోట్లకి సమానం. ఇలా వచ్చిపడుతోన్న సొమ్ము, మ్యూచువల్ ఫండ్స్ (ఈక్విటీబేస్డ్) మేనేజర్లు పైన చెప్పుకున్నటువంటి లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో  వాటి షేర్లు ఈక్విటీ మార్కెట్లో భారీగా పెరగడానికి అవకాశం కల్పిస్తోంది..అందుకే ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్లు కూడా వీటిపై దృష్టి సారిస్తే లాభాలు ఒడిసిపట్టే ఛాన్స్ ఉంది.

Comments