కేతిగాడు జయలలితపైనా తీస్తాడట


ఈ మధ్యకాలంలో ఓ కేతిగాడు బయల్దేరాడు. చనిపోయిన ముఖ్యమంత్రులు..వారి మరణాలు కాస్త వివాదస్పదం కావడంతో వాటిపైనే సినిమా తీస్తానంటూ హడావుడి చేస్తున్నాడు..ఇతగాడి పైనాన్షియల్ స్టేటస్ గురించి గతంలోనే మనం చెప్పుకున్నాం..నిజానికి ఎవరు ఎవరిపైనైనా సినిమా తీయొచ్చు..కానీ ఆతర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు కావాల్సిఉంటుంది..అందరూ సూపర్ స్టార్‌లా ఎవడైతే నాకేంటనే రేెంజ్ లో సినిమాలు తీయలేరు కదా..ఆయన తీేసిన మండలాధీశుడు, నాపిలుపే ప్రభంజనం, సాహసమే నా ఊపిరి బాగా ఆడాయ్. గండిపేట రహస్యం బోల్తా కొట్టింది. ఇక ఆ తర్వాత దాసరి తీసిన కలియుగవిశ్వామిత్ర మూలపడగా..ఇంకెవరో తీసి వదిలారు..అది కూడా భారీ బండ పడింది.


ఐతే 1989లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇంకా ఏం తీస్తార్లే అనుకునేవాళ్లకి షాక్ ఇచ్చేలా రిక్షావాలా అని ఓ సినిమా తీశారు..అది ఎంజిఆర్ సినిమాకి  రీమేక్అట..
ఐనా ఫలితం శూన్యం. డబ్బాలు వెనక్కి వచ్చేశాయ్. అలా ఎన్టీఆర్‌ని టార్గెట్ చేసి తీసిన వాళ్లలో కృష్ణ పేరు అగ్రస్థానం ఆక్రమించింది. ఆ తర్వాత కాంగ్రెస్ సిఎంలను టార్గెట్ చేస్తూ సినిమాలు వచ్చినా..అవన్నీ గుంపులో గోవిందయ్యలే తప్ప..పర్టిక్యులర్‌గా ఓ క్యారెక్టర్ క్యారికేచర్ లేనివి..

ఇప్పుడు మళ్లీ లక్ష్మీస్ వీరగ్రంధంతో ఓ హడావుడి జరుగుతోంది..అతగాడే..తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్టోరీతో శశిలలిత అనే సిన్మా తీస్తానంటూ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు..ఇదిగో ఇలాంటి న్యూస్ చదివినప్పుడే పొట్టచెక్కలయ్యేలా నవ్వొస్తది..ఎందుకంటే..తమిళనాడులో ఇప్పుడంటే శశికళలోపలుండి టైమ్ బ్యాడై...పెతోడూ కామెంట్లు చేస్తున్నారు కానీ...పొరపాటున ఆమే..తిరిగి చక్రం తిప్పిందా..వీళ్లంతా చచ్చారన్నమాటే..ఐనా జయలలిత ఫ్యాన్స్ కూడా తక్కువమందేం లేరు..వాళ్లంతా ఇక్కడి లక్ష్మీపార్వతిలా బలగం లేనోళ్లు కాదు..అమ్మమీద సినిమా తీత్తావ్ రా..అంటూ చెలరేగారనుకోండి..మనోడి  పని..పాపం పరుగో పరుగే..
ఇవన్నీఇలా ఉంచితే..ఇతగాడు సినిమాలు ఏవో షేక్ చేస్తాయ్...బ్రేక్ చేస్తాయ్ అనుకుంటూ ఓ డైలీ తెగ రాసేసుకుంటోంది..నిజంగా మనోడికి అంత సీన్ ఉంటే..ఈపాటికి వీరగంధం సగం పూసేసేవాడు కదా..

Comments