మంత్రి అఖిలప్రియకి మరో షాక్..ఈసారీ టిడిపి నుంచే!


మంత్రి భూమా అఖిలప్రియకు షాక్ పై షాక్ తగులుతోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బోటు ప్రమాదం తర్వాత పార్టీలో సాక్షాత్తూ సిఎం చంద్రబాబే ఆమెకి క్లాస్ పీకినట్లు గతంలో చెప్పుకున్నాం. ఇవాళ అసెంబ్లీలో పార్టీ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ ఆమెకి చురక వేసారు

తెలుగువారం, తెలుగు మాతృభాషగా కలిగి ఉండి..ఖచ్చితంగా తెలుగులోనే చదవాలని నిబంధనలు పెడుతోన్న తరుణంలో ఇలా అసెంబ్లీలో ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.పైగా తెలుగు గురించి ఇంగ్లీష్ లో చెప్పడం సరికాదని చెప్పారాయన. ఈ అంశంతో తిరిగి జవాబు చెప్పలేని స్థితిలో పడిపోయారు మంత్రి. ఈవిషయంపై గతంలో కూడా చాలా చర్చలే జరిగాయ్..ఐతే కొన్ని అంశాలపై మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వాడకతప్పదు..ఐతే వీలైనంత తెలుగు మాట్లాడటమే ఎంతో హాయిగా ఉంటుంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  కూడా ఓ సందర్భంలో " వియ్ లవ్ తెలుగు " అన్నారు..వెంటనే నవ్వేసారు కూడా..అలానే తెలుగులోనే టుమినిట్స్ నాన్ స్టాప్‌గా మాట్లాడాలనే పోటీలు కూడా హాస్యాస్పదమే. తెలుగు పదాలు..తెలుగులోనే ఉండాలి..కొత్తపదాలు తెలుగులో సమ్మిళతమైనప్పుడే భాష సుసంపన్నమవుతోంది. ఎందుకంటే ఏ ఇంగ్లీష్ పదమైనా తిరిగి రాసేది వ్రాసేది మన అక్షరాలలోనే కదా..అలాంటి భాష ఎప్పుడూ మరణించేది కాదు.ఇక లీడర్ల విషయానికి వస్తే కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు తెలుగులో మాట్లాడాలంటే నానా అవస్థలూ పడతారు..అలానే కొందరు ఎంపిలు మచ్చుకి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గల్లా జయదేవ్ లాంటి వాళ్లు కూడా మాట్లాడుతుంటే తమాషాగా అన్పిస్తుంటుంది. ఇక చంద్రబాబుగారి కుమారుడు నారా లోకేష్ భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే  అంత మంచిది..

ఇక అచ్చ తెలుగు భాష, తెలుగు కట్టుబొట్టూ అంటే మాత్రం గుర్తుకువచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అనడంలో సందేహం లేదు..ఎందుకంటే వైఎస్ అనగానే కళ్లముందు కదలాడే రూపమే దానికి నిదర్శనం..అసెంబ్లీలో వేమనశతకాలను, సుమతి శతకాలను ఆశువుగా సందర్భానికి తగినట్లు చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి. ఇప్పుడు అడపాదడపా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ప్రసంగాల్లో అక్కడక్కడా సామెతలు చెప్తూ రంజింపజేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో దాదాపుగా తెలుగే ఎక్కువ వాడతారు.
పై విషయాలన్నీ పక్కనబెడితే  ప్రస్తుతం తెలుగు నేర్చుకోవాలన్న అవసరం మాత్రం సాధారణులకంటే..ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకే అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు

Comments