ఈ కలియుగ యముళ్లకి చట్టాలు లేవా


సిటీలో తిరిగే జనానికి అందులోనూ బస్సుల్లోనూ జర్నీ చేసేవారికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ల తీరు భయోత్పాతం కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా నమోదవుతోన్న ప్రమాదాల సంఖ్యే ఇందుకు నిదర్శనం..కావాలంటే  ఈ ఉదాహరణలు చూడండి
సెప్టెంబర్ 1 నిర్మల్ లో ఓ బస్సు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు 20మందికి గాయాలు
ఘట్ కేసర్‌ దగ్గర బైక్ పైకి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకుల మరణం
అక్టోబర్ 5 ఆటోపైకి దూసుకెళ్లడంతో 5 గురు చనిపోయారు
ఇక సిటీలో అయితే చెప్పక్కర్లేదు..ర్యాష్ డ్రైవింగ్‌తో జనం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..బస్టాప్‌లో ఆపరు.జనం కన్పిస్తున్నా ఆగకుండా వెళ్లి ఎక్కడో నిలబెట్టేస్తారు..పైగా శాడిజం ప్రదర్శిస్తూ..వెంటనే మూవ్ చేస్తారు..ఎక్కితే ఎక్కు లేకపోతే నీ చావు నువ్వ్ చావ్ అన్నట్లు బిహేవ్ చేస్తుంటారు..ఇక మెహదీపట్నం, లింగంపల్లి, సికింద్రాబాద్ లాంటి జంక్షన్ల దగ్గరైతే ఓ బస్సు ఆగుతుంది..దాని పక్కనే మరో బస్సు ఆపుతారు..ఎలాగంటే..కనీసం ఇవతలి బస్సులోవారు కనీసం దిగే సందు కూడా ఇవ్వకుండా రాసుకుంటూ కదిలిస్తుంటారు..మధ్యలో ఇరుక్కుని చచ్చినా మాకు సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తుంటారు..ఈ స్టోరీ చూసి ఎవడైనా కేసు పెట్టినా సరే ఇందుకు సంబంధించిన ఫుటేజ్ చూపించగలను..ఈ కలియుగ యముళ్ల నుంచి రక్షణ ఇవ్వాల్సిన ఆర్టీసి సిబ్బంది మాత్రం తప్పు  పాదచారులదేనంటూ తప్పించుకుంటున్నారు. పైగా గతంలో కంటే తగ్గాయనిి చెప్తున్నారు. ప్రమాదాలు తగ్గడమేంటే మరణాల సంఖ్య తగ్గడమేనా రీసెంట్ గా మీర్ పేట లో నూ యు టర్న్ తీసుకుంటూ డైరక్ట్ గా ఓ లేడీని చంపేశాడో డ్రైవర్..వీళ్లకేం శిక్ష పడాలో చదువరులే తేల్చాలి.

Comments