అనుష్క..ఇక శిధిల సౌందర్యమేనా


అనుష్క..ఒకప్పుడు ఈ పేరు అటు యూత్..ఇటు లేడీస్‌లో బాగా మారుమోగింది. పాత్రోచితమైన నటన పెద్దగా లేకపోయినా..అందం, అభినయంతో కొట్టుకువచ్చిన అనుష్క టాప్ రేంజ్‌కి ఎదిగింది..అరుంధతి తర్వాత పెద్దగా యూత్ హీరోలతో చేసిన సినిమాలు ఆడింది లేదు. ప్రభాస్‌తో మిర్చి ఒక్కటే హిట్..ఇక ఆ తర్వాత చెప్పుకోవడానికి బాహుబలి మాత్రమే మిగిలింది. సినిమాలు భారీ పెట్టుబడులతో తీసినా..అనుష్కని యూత్ ఫుల్ ‌గా చూపించిన సినిమాలు లేవ్.
దీంతో ఇక ఒకప్పుడు సౌందర్య అంతకమంటే ముందు విజయశాంతి ఎదుర్కొన్న దశలోకి వేగంగా జారిపోయింది. విజయశాంతి అంటే తానే హీరోగా కనీసం 15 సినిమాలు నటించింది వాటిల్లో ఐదేళ్లకో హిట్ వచ్చి..మిగిలినవి యావరేజ్‌గా ఆడినా..కెరీర్ లాంగ్ రన్‌లో ఉపయోగపడ్డాయ్. సౌందర్య కూడా అంతే హెద్దహీరోలతో చేయడం తప్ప( చివర్లో) హిట్ సినిమాలు కరువయ్యాయ్..ఇప్పుడు అనుష్క కూడా అంతే అనుకోవాలి..హిట్లు..ఇస్తు..ఇస్తూనే ఇక నిష్క్రమణ దశకి వచ్చేసింది..ఇది ఆమె అభిమానులకు నచ్చకపోవచ్చు కానీ వాస్తవం మాత్రం అంతే..లవ్ స్టోరీస్ కానీ..కాలక్షేపం సినిమాల్లో కానీ ఆమెని తీసుకోవడానికి నిర్మాతలు రెడీగా లేరు..అందుకే ఇక తన ఫ్యాట్ తగ్గించుకోడవంపై దృష్టి పెడుతూ పెడుతూనే ఇక ఏదోక రోజు పెళ్లిబాజాలు మోయిస్తుందేమో మరి

Comments