లోకేష్ మంత్రయ్యాక ఇలాంటి తిట్లు ఇంతవరకూ తిని ఉండడు..చెలరేగిన పోసాని



ఒక నిమిషం కాదు..పది నిమిషాలు కాదు..దాదాపు ముప్పావుగంట..తిట్టిన  ఏకి పారేసాడు పోసాని కృష్ణ మురళి
ప్రెస్ మీట్ పెట్టిమరీ! ఈ మధ్యకాలంలో పాపం నారాలోకేష్‌పై ఈ రేంజ్‌లో రెచ్చిపోయిన లీడర్లు లేరు. అసలు సినిమా రంగంలో అసలే లేరు. పైగా ఓ మంత్రి అందులోనూ ముఖ్యమంత్రి కుమారుడు అని కూడా చూడకుండా...ఏకంగా యెదవ,లఫూట్ ని కాదు..మీలాగా అంటూ పోసాని రెచ్చిపోయిన తీరు అందరిలో చర్చ రేకెత్తిస్తోంది..పైగా తన కులం పేరు కూడా చెప్పుకుని మరీ ఈ అవార్డు వద్దన్నాడు..ఎక్కడ తనకు కులం కారణంగా అవార్డు వచ్చిందనే అపవాదు వస్తుందేమో...అందుకే నాకీ అవార్డు వద్దని కుండబద్దలు కొట్టేశాడు..ఈ మాత్రం సత్తా అవార్డులు వచ్చాయని ప్రకటించుకున్నవాళ్లు కానీ..విమర్శలు చేస్తున్నవారు కానీ చేయలేదు.

లోకేష్ మాట్లాడిన ప్రతి మాటకీ, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రతి వ్యాక్యానికీ కౌంటర్ ఇస్తూ సాగిన పోసాని కృష్ణమురళి  ప్రెస్ మీట్ పొలిటికల్ పంచ్‌లతో కూడా మంచి మజా తెచ్చిపెట్టిందనడంలో సందేహంలేదు.




ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆకాశానికెత్తేసిన తీరు టిడిపి వర్గాలకు కుతకుతలాడేలా చేస్తుందనడంలో సందేహం లేదు..తెలుగు రోహింగ్యాలామా మేం ఏమైనా అంటూ పోసాని అడుగుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్..


పైగా నారా లోకేశ్‌కి కనీసం ఓ పదిమందిని గురువులను పెట్టించుకుని మరీ ఎట్టా మాట్టాడుకోవాలో తెలుసుకో అంటూ సూటిగా సుత్తి లేకుండా చెప్పడం మాత్రం ఆయన అభిమానులకు కడుపు మంట పుట్టించేదే..ప్రతి అసెంబ్లీ సెషన్లలో " అబ్బా లోకేశ్..సూపర్ ...వయ్యా ఏం పని చేస్తున్నాడో చినబాబూ " అంటూ ఎత్తేసే మంత్రులనే చూసిన లోకేశ్..ఇప్పుడు పోసాని తీరుతో ఓ రకంగా షాక్ తిన్నట్లే..ఎందుకంటే. పోసాని ఎంత దారుణంగా ఉతికి ఆరేశాడో..ఈ వీడియోలు చూస్తే చాలు..నీలాంటోడు మా మంత్రిగా కావడం మా ఖర్మ అని ఇంత సూటిగా ఇంకెవరూ చెప్పరు కూడా ...దీంతో టిడిపి జనాలకు రేగిపోతుంటే...ఇతర పార్టీ అభిమానులు ఫాలోయర్లు..చప్పట్లు కొట్టి మరీ అబినందిస్తున్నారు పోసాని కృష్ణమురళిని.





Comments

  1. కే సీ ఆర్ ఆంధ్రావాళ్ళని తిడుతున్నపుడు ఒక్కడు కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టి తిట్టలేదు. పౌరుషం రోషం చచ్చిపోయాక ఎవడు తిట్టినా భరిస్తూనే ఉన్నారు.

    ReplyDelete

Post a Comment