వెయ్యి కోట్ల పడగల నీడలో శశికళ ఫ్యామిలీ


తవ్వేకొద్దీ కట్టలు..కట్టలు కట్లపాములే! తమిళనాడులో శశికళ అండ్ కో పార్టీ దగ్గర దొరుకుతోన్న సొమ్ము..ఇప్పటిదాకా 1460కోట్లు బయటకి తీశారట..మరి సందర్భం ఏదైనా కానీ, మోడీ అక్కడకు వెళ్లొచ్చిన ప్రతిసారీ ఏదో జరుగుతుందనే డిస్కషన్ పక్కకి బెడితే...10కోట్ల డబ్బు, 7.5కోట్ల బంగారం..ఇంకా లెక్కకి రాని ఆదాయం బోలెడు..ఇదంతా గత 30 ఏళ్లలో శశికళ డైనాస్టీ నేస్టీగా సంపాదించి కుప్పలు పోసిందట..ఇదంతా ఎక్కడో తెలుసా.! రియల్ ఎస్టేట్‌లో..ఇప్పుడా సొమ్ముని ఇన్‌కమ్ ట్యాక్స్ రెైడింగ్స్‌లో బైటికి తీస్తున్నారు. ఇన్నాళ్లూ కన్పించలేదా...కన్పించింది..కానీ...పవర్ ఉంది కదా..! అందుకే అధికారంలో ఉన్నప్పుడు..దాన్ని నిలబెట్టుకునేందుకు లీడర్లు అంత తాపత్రయపడేది. ఒక్కసారి దిగామా..ఇక  అంతే సంగతులు..ప్రతీవాడూ కన్నేస్తాడు..ఓ హింట్ ఇస్తాడు..వెంటనే రైడింగ్స్ ప్రారంభం ఐపోతాయ్..కూసాలు కదిలిపోతాయ్. గత 20 ఏళ్లలో జయలలిత సామ్రజ్యాన్ని ఆదాయపు పన్ను అధికారులు పట్టించుకోవడం ఇది మొదటిసారి. ఎప్పుడో 1996లో ఐటీ రైడ్స్ తర్వాత ఇవే మళ్లీ..ఈ మధ్యకాలంలో ఆ వైపు కన్నేయడానికి కూడా ఐటీ వింగ్‌కి సాధ్యపడలేదు

187 ప్రదేశాల్లో ఐటీ రైడ్స్ జరిగాయట..అంటే ఈ సామ్రాజ్యం ఎంతగా పాతుకుపోయిందో  అర్ధం చేసుకోవచ్చు. వీటిని వెలికితీయడానికి కనీసం 2000 మంది అధికారులు పని చేసారు. ఇవి ఇంతటితో ఆగుతాయో...ఇంకా కొనసాగుతాయో పై స్థాయి నుంచి వచ్చే ఆజ్ఞలను బట్టి ఉంటుంది. సామాన్యుడు కలలో కూడా ఊహించలేనంత ఆస్తులు, సంపద వీళ్లకి ఈ స్థాయిలో వచ్చి పడిందంటే సొసైటీలో సిస్టమ్స్ పనితీరు ఎలా ఉందో అర్ధమవుతోంది..ప్రతి పనీకీ వెల కట్టడం, ఐనవారికి ప్రాజెక్టులు..కిడ్నాపులు, మర్డర్లు..ఇదీ మన్నార్ గుడి బంధువర్గం చేసే పని..ఇందుకోసం ఐఎఎస్‌లను వాడతారు..ఒక్కోసారి  వారిపైనే ఆసిడ్ అటాక్సూ జరుగుతాయ్. తమ భాగోతం కప్పి పుచ్చుకునేందుకు టివి ఛానళ్లు..వాటిలో తమని పొగుడుకుంటూ స్టోరీలు..ఎదుటివాళ్లపై అడ్డంగా కథనాలూ..ఇవే వారి ఆయుదాలు..ఇలాంటి నేతలను అమ్మ  అని..చిన్నమ్మ అని జనం పిలుచుకుంటున్నారంటే..దోచుకున్న సొమ్ములో ఎంగిలి మెతుకులు రకరకాల పథకాల పేర్లతో విదిలించడం వల్లనే కదా..!

Comments