ఎగతాళి చేయడం, బూతులు మాట్లాడటం క్రియేటివిటీనా అనసూయా!


ఓ తప్పు దొర్లింది..అదలా వందతప్పులపైనే చేరాయ్..అయినా బుద్ది రాదు..ఎందుకంటే అందరూ చూస్తున్నారంటారు. ఇలా మాట్లాడిన నటులు అసెంబ్లీలోనే సారీ చెప్పుకోవాల్సి వచ్చింది..ఐతే జబర్దస్త్ షో గురించి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, కోర్టులు స్పందించలేదు కాబట్టి బతికిపోతున్నారు. అనాధలంటే ఎవరు అనే ఓ ప్రశ్నకి, ఏదో పెద్ద వివేకానందుడిలా బిల్డప్ ఇచ్చుకుంటూ ఓవెకిలి సమాధానం చెప్పిన (ఇక్కడ వివేకానందుడి ప్రసక్తి అనవసరం ఆ రేంజ్ వ్యక్తిలా బిహేవ్ చేశాడని చెప్పడమే ఆంతర్యం) ఆదిగాడు(గాడు అనొచ్చుఎందుకంటే వాళ్లేసే స్కిట్క్స కంటే ఇదేం ఘోరమైన తప్పు కాదు) తర్వాత కవర్ చేసుకోలేక నానా అవస్థలూ పడతుున్నాడు..ఈలోపు ఈ అనసూయ అనబడు యాంకర్ చేస్తోన్న హడావుడి అంతా ఇంతా కాదు
" జబర్దస్త్ ఓ బాహుబలి..క్రియేటివిటీని తొక్కేయవద్దు..ఫన్‌ని ఫన్‌లా చూడండి" లాంటి  డైలాగులేస్తుంది . 

ఏమైనా అర్ధముందా అసలు  ఈ మాటలకు..మీ క్రియేటివిటీ మీ దగ్గర ఉంచుకోండి..మీరు మాైట్లాడుతోంది మీకేమైనా అర్ధం అవుతుందా..బూతేదో...డబుల్ మీనింగ్ ఏదో..సరైన పదమేదో తెలీని స్థితిలో ఉన్న మీరు సమాజానికి సందేశాలు ఇవ్వక్కర్లేదు.. ఏదో రోజు పాపం పండుతుంది..ఇలా అడ్డదిడ్డమైన సినిమాలు తీసిన తర్వాతే ..ఓ హీరో ఇంట్లో కూతురు లేచిపోయింది...మరో హీరో ఇంట్లో ఫైరింగ్ అయింది..ఇంకొంతమంది డ్రగ్స్ వాడుతూకూడా...బాధితులమంటూ దర్జాగా బైట తిరుగుతున్నారు..సొసైటీకి మీరు ఊడబొడిచేదేం లేదు...ఏదో ఓ అరగంట మీ సన్నాయి మేళాన్ని చూస్తున్నారంటే...అద్భుతంగా నచ్చి కాదు..రికార్డింగ్ డ్యాన్సులు కూడా చూస్తారు..అంత మాత్రాన అదో పెద్ద కళని కాదుగా( రికార్డింగ్ డ్యాన్సర్ల జీవితాలు దుర్భరం..ఐనా అవి అశ్లీలం కాబట్టే ఇలా రాశా)..నువ్వెలాంటి దుస్తులు వేసుకుంటావో మాకెందుకులే కానీ...ఇక్కడ నీ బికినీ బట్టలు పెట్టొచ్చు కానీ...నీ ఫోటో వేసుకుని లైకులు తెప్పించుకున్నామనే ఏడుపు మాకెందుకు
రేపొద్దున్న కోర్టు పిలిచి మొట్టికాయలు వేసి  జైల్లో వేయండనే తీర్పిస్తేనే మీరు చేసింది తప్పు అనుకోవాలా...మీకు మీరుగా ఏదీ నేర్చుకోరా...!

Comments