గురి తప్పిందా..తప్పుడు లక్ష్యమా!డీమానిటైజేషన్..డెమోలిషన్ ఆఫ్ ది ఎకానమీ


డీమానిటైజేషన్ కి ఏడాది పూర్తైంది..తద్దినం పెట్టినట్లుగా..ప్రతిపక్షాలన్నీ ఇవాళ బ్లాక్‌డే పిలుపు ఇచ్చాయ్. సహజంగానే ఈ ప్రదర్శనకు జనం మద్దతు లభిస్తుంది.ఎందుకంటే..శ్రీమాన్ మోడీగారు ఏకపక్షంగా గత ఏడాది క్రితం అర్ధరాత్రి నుంచే పెద్దనోట్లు చెల్లవంటూ శెలవిస్తూ చేసిన ప్రసంగాల్లో ప్రముఖమైన నినాదం..అవినీతిపై పోరాటం. అబ్బో అబ్బో అంటూ చాలామంది తెగ పొగిడేశారు..ఏం జరుగుతుందోకూడా తెలీకుండానే..తప్పుబట్టినవాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించారు.

 క్యూలైన్లు..ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ అందక దాదాపు 1200మంది పైలోకాలక ిపయనం అయ్యారని అంటారు. ఐతే  ఈ సంఖ్యపై అనుమానాలు..అపవాదులు ఉన్నా..నిజం మాత్రం జనం చచ్చారనేది..చేతిలో డబ్బుండి కూడా కనీస అవసరాలు కూడా తీరని నరకం మొదటి నెలరోజులూ అనుభవించారు..

కనీసం ఏటిఎంల కాలిబ్రైజేషన్ (అంటే పెట్టే పెద్ద నోట్లకి అనువుగా లోపలి అచ్చులు తయారు) కూడా చేయకుండానే
పెద్ద పేద్ద నోట్లని దింపుతామన్నారు..50 రోజుల్లో మీ కష్టాలూ తీరిపోతాయ్ అని ప్రగల్భాలు పలికారు.

మరింతవరకూ డబ్బుల కష్టాలు తీర్లేదు..పైగా పరిమితులు ఒకటి విధించారు..డిజిటల్ ఇండియా మ ా లక్ష్యమని ఆ తర్వాత చెప్పుకొచ్చారు..లెస్ క్యాష్ అంటున్నారు..నిజమే క్యాష్‌లెస్ గానే మార్చారు..ఈ మాత్రం దానికి ఉన్న నోట్లు ఎవరిని అడిగి..ఎవరి నిర్ణయంతో రద్దు చేసిందీ ఇప్పటిదాకా చెప్పుకునే దమ్ము లేదు..అందుకే నిన్న అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చిన ప్రసంగంలో కూడా ఏ మాత్రం పసలేదు..గతేడాదికాలంగా ఏం చెప్పుకున్నారో..అవే చెప్పుకుంటూ ఉన్నారు. ఇకపైనా చెప్తారు..దీర్ఘకాలిక లక్ష్యాలంటారు..అవేంటే కనీసం చెప్పగలరా..జిడిపి పడిపోయింది కాబట్టే..దానికి పూతలాగా..ఏదోటి హడావుడి ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసినవారి అంచనాలకు అనుగుణంగానే
ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు వచ్చాయ్...దాని అండతో  ఏదో పొడిచేద్దామనుకుంటే ఏమీ సాగదు..ఎందుకంటే అసలు  వ్యాపారం సంగతి మోడికే తెలియాలి..కానీ..దేశవ్యాప్తంగా 10లక్షల చిన్న తరహా వ్యాపారాలు మూతబడ్డాయ్
ఇవి డెమోతో కావచ్చు..జిఎస్టీ దెబ్బకి కావచ్చు..ఐతే ఎన్డీఏ చెప్పుకుంటున్నట్లు నిజంగానే డీమానిటైజేషన్, జిఎస్టీ
రెండూ గేమ్ ఛేంజర్లే..అందుకే ఆటని మార్చేశాయ్.   పన్ను వసూళ్లు పెరిగాయి...డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయ్. అసలు దేశంలో అంతా సుభిక్ష వాతావరణం కన్పిస్తోందంటూ డబ్బా వాయించుకోవచ్చు కానీ..వాటి ఫలితం 2019లో ఖచ్చితంగా కన్పిస్తుంది..అసలు డీమానిటైజేషన్ లక్ష్యమే అనుమానాస్పదం అని కాంగ్రెస్ ఆరోపించింది..అందులో నిజం ఉన్నా లేకపోయినా..డీమానిటైజేషన్ మాత్రం లక్ష్యం లేని తూటా...100మైళ్ల వేగంతో వెళ్తోన్న జిడిపి అనే కారు టైర్లని కాల్చింది..బరస్ట్ అయింది కారు..ఇక దానికి పంక్చర్ వేస్తారో...లేక స్టెపినీతో ఝామ్ ఝూమ్ అంటూ లాగిస్తారో చూడాలి
కింద ఫోటోలో ఓ మిత్రుడు ఏడాది క్రితం పోస్ట్ చేసిన ఓ లెక్కలు చూడండి..పప్పు రేటు తప్ప మిగిలినవి అన్నీ అలానే ఉంటాయ్



Comments