తెలుగుదేశంలోకి కిరణ్ బ్రదర్..చంద్రబాబుకే ఎక్కువ లాభం..భజనకి మరో ఛానల్ తోడైనట్లే


టిడిపిలోకి నల్లారి కిషోర్ కుమార్  జాయినైపోయాడు కొడుకుతో సహా! ఇక మిగిలింది..కిరణ్ కుమార్ రెడ్డి..ఈయనకో పార్టీ ఉంది జైసమైక్యాంధ్ర..కానీ అటు బిజెపి, వైెఎస్సార్ కాంగ్రెస్, ఇటు టిడిపి సహా ప్రతి పార్టీలో జాయినవుతాడని పేరు విన్పించినా..ఆయన మాత్రం ఇంతవరకూ కదల్లేదు..మాట వదల్లేదు..ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్‌లో ఒకరు టిడిపిలో జాయినవడంతోనే ఆయన తర్వాతి అడుగులు ఎటనేది తెలిసిపోతోంది. ఖచ్చితంగా రాజ్యసభ మెంబర్ షిప్ ఆయనకి కన్ఫామ్ అయిందని టాక్.

ఐతే పార్టీలో జాయినవుతోన్న సందర్భంగా చంద్రబాబు నల్లారి కుటుంబం అంటే తనకెంతో గౌరవం అని చెప్పడం గమనార్హం. నల్లారి అమరనాధ్ రెడ్డి(సీనియర్) చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న సమయంలో ఆయన ఓటమికి కారకుడని బాబుపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రతీకారంతో  రగులుతుంటారని అంటారు..ఐతే ఇదేం సినిమా కాదుగదా..అవలానే ఉండిపోవడానికి. ఎటొచ్చీ నల్లారి కుటుంబం టిడిపితో కలవడంతో కొత్తగా కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వచ్చేదేం ఉండదు..అంతా చంద్రబాబుకే ప్లస్ అని చెప్పొచ్చు..ఎందుకంటే జిల్లాలో బలమైన నేతల కొరతని కిరణ్ ఫ్యామిలీ  రాకతో పూడ్చుకున్నట్లే..అలానే జగన్ మోహన్‌రెడ్డి బలాన్ని దెబ్బతీయాలంటే..ఇప్పుడు మరో చేయి కలిసి వచ్చినట్లే చెప్పుకోవచ్చు. అటు సికె  బాబు  బిజెపిలో చేరతారనే టాక్ ఉన్నప్పుడు ఇక జగన్‌కి మిగిలేది రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..అతని సన్,  చెవిరెడ్డి, భూమన్ మాత్రమే

ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే..ఇప్పటికే ఈటీవీ, ఏబిఎన్, మహా న్యూస్, టివి5, టివి9, ఎన్‌టివి( వీటిలో కొన్ని సమయానుకూలంగా బాబుకి బాకా ఊదుతుంటాయ్..కొన్నిటికి ఎజెండానే అది)  టిడిపికి  అనుకూలమని చెప్తుంటారు..కిరణ్ కుమార్ రెడ్డి మరో సోదరుడు సంతోష్ ఆధ్వర్యంలోనే గత మూడేళ్లుగా ఐ న్యూస్ నడుస్తోంది.ఇప్పుడా ఛానల్ కూడా టిడిపికి వంత పాడకతప్పదు..సో అటు పార్టీబలం, ప్రచారబలం నల్లారి ఫ్యామిలీ రాకతో చంద్రబాబుకి తోడైనట్లే చెప్పుకోవాలి. ఇక వచ్చే ఎన్నికల్లో ఎన్ని టిక్కెట్లు ఈ ప్యామిలీకి అప్పగిస్తారో చూడాలి 

Comments