మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు


మెగాస్టార్ సినిమాలు లేకపోయినా...పాలిటిక్స్‌లో పెద్దగా పవర్ చూపకపోయినా..ఆయనకి సంబంధించిన ఏదైనా అభిమానులకు న్యూసే! అలాంటిది చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు..బహువచనం వాడాను కానీ..దొంగ ఒక్కడే అతడు కూడా ఇంటిదొంగే! సారీ ఇంట్లోని మనిషే..చెన్నయ్య అనే కుర్రోడు గత పదేళ్ల నుంచీ చిరంజీవి ఇంట్లో పని చేస్తున్నాడట. అతనే రెండ్రోజుల క్రితం రూ.2లక్షలు కాజేశాడని పోలీసులు నిర్ధారించేశారు.
కానీ ఇక్కడ అనేక సందేహాలు..చాలా రోజులనుంచీ ఇంట్లోంచి లక్షలకి లక్షలు డబ్బు మాయమవుతోందట. అది కూడా దాదాపు 20లక్షలట.. ఇంత పెద్ద ఎత్తున డబ్బు పోతుంటే..ఎలా ఊరుకున్నట్లు
2. అంత పెద్ద ఇంట్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఉంటాయ్..వాటిని గమనించలేదా
3. డబ్బుతో పాటు నగలు..ఆభరణాలు కూడా కాజేశాడా అనేది ఎంక్వైరీ చేస్తున్నారట..అంటే అంత లెక్క లేకుండా
జ్యూయెల్రీ ఉందా చిరు ఫ్యామిలీ దగ్గర..ఉండొచ్చుఅది తప్పేం కాదు..కానీ ఇలాంటి లీకులు ఎందుకు పేపర్లకి
ఇచ్చారు..నిజంగా జరిగింది దొంగతనమేనా?
4. ఎందుకంటే..ఓ స్టార్ హీరో ఇంట్లో దొంగతనం జరగడం..వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగితే..ఎందుకు
మీడియాకి చూపించడం లేదు
ఇవన్నీ నాలాంటి దారినపోయే దానయ్యలకే వస్తే..పోలీసులకు రావా! వస్తాయ్..!

Comments