మరణం అనివార్యం..సాయిబాబాని పట్టించుకునే దిక్కు లేదు


వచ్చే వరకూ తెలీదు..వచ్చిన తర్వాత ఇక దాని గురించిన భయం లేదు..ఐతే అది వస్తోందని తెలిసి..వాయిదా వేయగలిగి ఉండి..లేదంటే రాకుండా చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఎవరూ పట్టించుకోకపోతే అది దారుణం..మరణం.అదే ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా ముంగిట్లో నిలబడి కబళించడానికి సిధ్దమైంది..తప్పించుకోవడానికి కూడా ప్రయత్నించలేని నిస్సహాయతలో ఆయన ఉండిపోయాడు..ఇది కూడా ఆయనే స్వయంగా తన భార్యకి రాసిన లేఖలో తెలిపాడు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసింది. నాగ్‌పూర్ సెంట్రల్ జైల్  అండాసెల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడాయన. ఈయన గురించి మనకి తెలిసింది ఇంతే కానీ ఆయన రాసుకున్న చివరి లేఖ మాత్రం ఎవరినైనా కదిలించకతప్పదు. జైల్లోని జీవితాలు ఇలా ఉంటాయా అన్పించకమానదు. కేసులు వదిలేయండి..శిక్షలు వదిలేయండి
ఓ మనిషి కిడ్నీలు పాడైపోయి చావుకి దగ్గరవుతుంటే మందులు కూడా ఇవ్వనంత కర్కశత్వం ఉంటుందా అన్పించకమానదు. మరి కోర్టులు ఏం చెప్పాయో తెలీదు కానీ ఆపరేషన్‍‌ అవసరమైన మనిషి నేలమీద పాక్కుంటూ జైల్లో తిరుగుతుంటే చూసి జైలు సిబ్బంది ఎలా స్పందిస్తున్నారో మనకైతే తెలీదు..బతుకు భారం అంటే ఇదేనేమో
బెయిల్ పిటీషన్ దాఖలు చేస్తే..మరి ప్రభుత్వం ఏ వాదన విన్పించి ఇలాంటి వ్యక్తికి బెయిల్ నిరాకరించాలని అడగగలదు..ఇవన్నీ నా(మన)లాంటి సామాన్యుల మదిలో ప్రశ్నలు మరి..విరసాలు..అరసాలూ...ఈయన విషయంలో ఏం చేయబోతున్నాయ్

Comments