స్మతి ఇరానీ చిలకజోస్యం నేర్చుకుందా..రాహుల్‌ కలలు కంటున్నాడట


రాహుల్‌గాంధీ బీట్ బిజెపిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీసుకున్నట్లు ఏ లీడరూ తీసుకోరు. అడపాదడపా అరుణ్ జైట్లీ కాస్తంత కౌంటర్ ఇద్దామని ట్రై చేస్తారు కానీ ఈ మధ్యకాలంలో రివర్స్ అవుతుండటంతో పెద్దగా మాట్లాడటం లేదాయన. ప్రస్తుతానికి రాహుల్‌గాంధీ పంచ్‌లు బాగా పేలుతున్నాయ్. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కానీ గెలిస్తే..ఇక రాహుల్ ప్రాభవానికి తిరుగుండదు. అదే ఊపులో 2019లో ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్ స్కందావారాలన్నీ ప్రమోట్ చేసేస్తాయ్. ఐతే ఇవేవీ స్మతి ఇరానీకి  పెద్దగా ఆనడం లేదు..ఆమె దృష్టిలో రాహుల్ గాంధీ 2014లో ఎన్నికలకి ముందు నేతలానే కన్పిస్తున్నాడు.  అందుకే రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నాడని..గుజరాత్‌లో కాంగ్రెస్ గెలవడం కల్ల అంటూ జోస్యం చెప్పేసింది. వరసగా దాదాపు 20 ఏళ్లనుంచి బిజెపిదే పీఠం కావడంతోపాటు..ప్రధానమంత్రి మోడీ ఇమేజ్ వలన గుజరాత్‌లో గెలుపు సునాయాసమని ఆవిడ భావిస్తుండవచ్చు.
కానీ రియల్ సిచ్యుయేషన్ వేరుగా ఉంది. వాటికి మొదటి సూచికే..అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికైన తీరు. కేంద్రం సపోర్ట్, రాష్ట్రంలో సరిపోయినన్ని ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బిజెపి అభ్యర్ది ఓడిపోయాడు..గెలవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్‌కి ఖచ్చితంగా ఉన్నా..చివరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  బిజెపి గూట్లో చేరిపోవడంతో అహ్మద్ పటేల్ ఎంపిక సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ తలపింపజేసింది..అలాంటి ఎన్నికలోనే అహ్మద్ పటేల్ గెలవడంతో కాంగ్రెస్‌ దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచినంత సంబరాలు చేసుకుంది..ఇక రెండోది రాహుల్ గాంధీ జిఎస్టీ మీద పేల్చుతున్న పంచ్‌లు అన్నీ ఇన్నీ కాదు..ఆయన హడావుడి దెబ్బకే జిఎస్టీ శ్లాబులు అమాంతంగా ఇప్పుడు తగ్గించారు(అని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ప్రచారం చేస్తోన్నాయ్)  డీమానిటైజేషన్ దెబ్బ గుజరాత్‌పైనే ఎక్కువ పడింది..ఇదీ ఆయన అంకెలతో సహా గుజరాత్ తీరంలో ప్రచారసభల్లో రెచ్చిపోతున్నాడు..ఇదివరకులా బట్టీ పట్టినట్లు కాకుండా..సభల్లో చెలరేగుతున్నాడు..అలాంటి రాహుల్‌ని ఇలా తీసిపారేయడం కూడా..బిజెపి కొంపముంచవచ్చు. ఎందుకంటే..బిహార్‌, పంజాబ్‌లో అదే జరిగింది కదా!

Comments