హిందాల్కో వేదాంత షార్ట్ టర్మ్‌కి రిస్కీ బెట్సా..?


అల్యూమినియం ప్రొడక్షన్‌లో హిందాల్కో, వేదాంత రెండూ పేరెన్నిక గన్నవి..క్యు2ఫలితాల్లో అదరగొట్టిన వేదాంత రానున్న కాలంలో కష్టాలెదుర్కోవచ్చని లెక్కలు చెప్తున్నాయ్ ఎందుకంటే ఈ రెండు కంపెనీలకి బొగ్గు కొరత ఏర్పడబోతోంది. అలానే వేలంలో వీటికి కేటాయించిన బొగ్గు ఇంకా సరఫరా అవలేదు. అల్యూమినియంఉత్పత్తిలో అవసరమైన విద్యుత్ శక్తి కోసం  8700 మెగావాట్ల సామర్ధ్యం ఉన్నకేప్టివ్ ప్లాంట్లు ఈ రెండు కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాయ్. ఐతే అల్యూమినియం ఉత్పత్తిలో అవసరమైన బొగ్గు మాత్రం సరిపడినంత అందుబాటులో లేకపోవడంతో ఈ రెండు స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోవచ్చని అంటున్నారు.

కోల్ఇండియా ఈ రెండుకంపెనీల అవసరాల్లో 75శాతం బొగ్గు సరఫరా చేసేలా ఒప్పందం కుదిరింది..ఐతే ఈ మేరకు సరఫరా చేయకపోతే పెనాల్టీ కట్టే షరతు కూడా ఉంది. వేదాంత వరకూ చూస్తే ఒడిశా ప్లాంట్‌లో 57శాతం కొరతతోనే అల్యూమినియం ఉత్పత్తి చేస్తోంది. భారత్ అల్యూమినియం కంపెనీ 21శాతం కొరత, హిందాల్కోకి ఈ కొరత మరీ భారీగా 78శాతంగా నమోదు అయింది..అంటే  సంస్థ తాలుకూ ఆదాయం,  అమ్మకాలపై ఈ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తుంది..మరి ఆ మేరకు క్యు3 ఫలితాలు కూడా రావచ్చు. 
ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని అల్యూమినియం అసోసియేషన్ ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ర్యాక్స్ కేటాయింపుతో పాటు గూడ్స్ రైళ్ల ద్వారా డెలివరీ సరైన సమయంలో చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దేశంలో అల్యూమినియం ఉత్పత్తి 20లక్షల టన్నుల నుంచి 41లక్షల టన్నులకి పెంచే లక్ష్యం ఉండగా.. అల్యూమినియం ఇండస్ట్రీ రూ.1.2లక్షలకోట్లు పెట్టుబడి పెట్టింది. డిమాండ్ చూస్తే ఏటా 10శాతం పెరుగుతోంది. ఐతే సిచ్యుయేషన్ మాత్రం ఇలా బొగ్గు కొరతతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుంది..పైగా ఈ రంగంలో కంపెనీల మొత్తం అప్పు రూ.70వేలకోట్లకి పెరిగిపోయింది. మొత్తం 7,50,000మంది ఉపాధి పొందుతున్నారు.

Comments