ఒక్క రూపాయికే కేజీ టమోటానా ! మార్కెట్ యార్డ్‌లో కాదు ఇంటికే డెలివరీ అట


 టమోటాలు ఈ మధ్యన సంవత్సరంలో కనీసం రెండుసార్లు కేజీకి 60 రూపాయలనుంచి 100రూపాయల వరకూ రేటు పలుకుతుంది..ఇప్పుడు మార్కెట్లో రేటు రూ.40వరకూ ఉందిలెండి..ఐతే ఇలాంటి టైమ్‌లో కేజీ రూపాయికే అంటే నమ్మబుద్ది కాదు కదా! ఆ..ఏ మదనపల్లి రైతుయార్డ్‌లోనో అయి ఉంటుంది అనుకుంటారేమో..అలా కానే కాదు
డిజిటల్ యుగమైపోయిందిగా ఇప్పుడు అందుకే జుగ్నూ అనే యాప్‌లో బుక్ చేసుకుంటే చాలు ఒక్క రూపాయికే కేజీ టమోటా ఇంటికి టెలివరీ చేస్తారట.

ఐతే ఇది లిమిటెడ్ ఆఫర్..అంటే నవంబర్3 నుంచి నవంబర్ 10 వరకూ మాత్రమే!

టమోటా లూట్ పేరుతో ఈ ఆఫర్ రన్ చేస్తోంది జుగ్నూ(Jugnoo). సమర్ సింగ్లా అనే ఓ వ్యక్తి ఈ సంస్థ సీఈఓ. రెండేళ్లక్రితం ఉల్లిపాయల రేటు పెరిగిన టైమ్‌లోనూ ఇలాంటి ఆఫరే రన్ చేసింది జుగ్నూ..! ఇదేదో బావుందనుకుని వెంటనే జుగ్నూ యాప్ డౌన్‌లోడ్ చేసుకోబోతున్నారా..ఆగండి..మనకా అదృష్టం ఉన్నట్లు లేదు..ఎందుకంటే ఇది ఛండీగఢ్‌లో మాత్రమే పని చేస్తుంది..2014లో ఇద్దరు ఐఐటి గ్రాడ్యుయేట్లు జుగ్నూని ఆటో రిక్షా ట్రాన్స్‌పోర్ట్‌తో లాజిస్టిక్స్ రంగంలో పనికొచ్చేందుకు తయారు చేశారు..కాలానుగుణంగా ఇప్పుడిలా మార్పులు చేస్తూ కస్టమర్ల బేస్ పెంచుకుంటోంది..అదీ రూపాయికి కేజీ టమోటాల కథ!

Comments