సూపర్ స్టార్ డాటర్ మనసులో మాట! శభాష్ మంజుల


ఓ  సూపర్‌స్టార్ వారసులంటే..ఖచ్చితంగా వాళ్లు బోర్న్‌ స్టార్సే! ఇది తెలుగువారి విషయంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. ఐతే అదే సూపర్‌స్టార్ కూతుళ్లుగా పుడితే మాత్రం సెలబ్రెటీ స్టేటస్ అయితే ఉంటుందేమో కానీ..తెరపై కన్పించడం జరగదు. అదే సూపర్ స్టార్ కృష్ణ రెండో కుమార్తె మంజుల విషయంలోనూ జరిగింది.. ఎప్పుడో ఎస్వీ కృష్ణారెడ్డి మాంచి ఊపులో ఉన్న సమయంలో టాప్‌హీరో బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా మంజులని అడగడం..కృష్ణ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయింది..ఐతే ఫ్యాన్స్ మాత్రం మీ డాటర్ హీరోయిన్‌గా చేయడానికి వీల్లేదంటూ అడ్డం తిరిగేసరికి..అంత పెద్ద హీరో కూడా మనసు మార్చుకోవాల్సి వచ్చింది. చివరకు మంజుల మనసు చంపుకుని నటనకి
దూరమైంది..కానీ తమిళంలో రాజస్థాన్ అనే మూవీ చేసింది..మనకీ అది డబ్ అయింది..అలానే షో మూవీతో తన
సత్తా కూడా చాటింది..ఐనా ఆమె మనసులో ఫ్యాన్స్ చేసిన రప్చర్ అలానే ఉండిపోయింది.


అది ఇవాళ ఆమె బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన మనసుకు నచ్చింది వీడియో మరోసారి బైటికి వచ్చింది..ఐతే
దాన్ని ఆమె అధిగమించిన తీరు మాత్రం అభినందనీయమే! వీడియో చూడండి

రీసెంట్‌గా మంజుల సందీప్ కిషన్ హీరోగా  తానే డైరక్టర్‌గా ఓ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. అలా తన తృష్ణని తీర్చుకుంటోంది.


సూపర్‌స్టార్‌గా కృష్ణ అంటే ఫ్యాన్స్‌కి ఎంత అభిమానమో..ఆయన కుటుంబసభ్యులన్నా అభిమానమే..ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు మంజులని చూస్తే..అప్పట్లో గొడవ చేసినందుకు బాగా ఫీలవుతారు. ఐతే కాలాన్ని వెనక్కి తిప్పలేరు కాబట్టి..మంజుల ప్రయత్నాలకు ఇప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడతారు.

Comments