బిఎన్‌రెడ్డి..హెచ్ఎం రెడ్డి..చక్రపాణి, నాగిరెడ్డి..వీళ్లంతా అంత అలుసుగా కన్పిస్తున్నారా?




1940-60 వరకూ తెలుగు చిత్రాలవరకూ ఆ మాటకి వస్తే భారత చలనచిత్రరంగం స్వర్ణయుగంగా చెప్తారు..ఆ కాలంలోని ఏ సిినిమా అయినా చూడండి..ఉత్తమ సమాజం ఎలా ఉండాలో..మానవీయ విలువలు దిగజారకుండా ఎలా ప్రవర్తించాలో తమ పాత్రల ద్వారా తెలిపేవారు. నిర్మాతలు కూడా మన సినిమాలు చూసి మంచి నేర్చుకోవాలి, ఆ సినిమా మేం తీశామని పదికాలాల పాటు గొప్పగా చెప్పుకోవాలని అనే లక్ష్యంతో నిర్మించేవారు.

నాయక, ప్రతినాయక పాత్రలు ప్రవర్తించే తీరులోనూ ఓ పద్దతి ఉంటుంది. చిల్లరచిల్లరగా తిరిగే కథానాయకులు అసలు కన్పించరు. కొండకచో..ఉన్నా..సినిమా మధ్యభాగానికి వచ్చేసరికి మారిపోయి ఉంటాయి. ప్రతినాయక పాత్రలు కూడా చివరిలో పశ్చాత్తాపం వ్యక్తం చేసేవి. ఇలా ఉంటేనే మంచి కథలా అని అడిగేముందు ఆయా సినిమాలు చూడండీ మీ ప్రశ్న మీకు ఎంత అబ్సర్డ్‌గా అన్పిస్తుందో..


మంచి చెేయకపోయినా ఫర్వాలేదు కానీ..చెడు మాత్రం నేర్పకూడదనే సూత్రం ఆ తర్వాతి రోజుల్లోనూ వర్ధిల్లింది..ఐతే తర్వాతి కాలంలో ఎంత భ్రష్టు పట్టిపోయాయో చెప్పక్కర్లేదు..చూసేవాళ్లు అవే చూస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు నింద మోపడం సరైంది కాదు. ఎందుకంటే..పది మంచి సినిమాలు తీస్తే 2 ఫ్లాప్ అయినంత మాత్రాన మంచివి ఎవరూ చూడరనేది వాదనకి నిలబడని అంశం..ఇంత ఉపోద్ఘాతమంతా ఎందుకయ్యా అంటే ఈ మధ్య తలాతోకా లేని ప్రతి సంస్థా ఏదో పేరిట పురస్కారాల పందేరం చేస్తున్నాయ్...పైగా వాటికి బి.నాగిరెడ్డి..బిఎన్ రెడ్డి..చక్రపాణి, హెచ్ ఎం రెడ్డి లాంటి పేర్లు పెట్టి మరీ దానం చేయడం కడుపు మంటకలిగిస్తోంది..పోనీ ఆ ఇచ్చేదేదైనా సరైన వాళ్లకి ఇస్తారా అంటే..వాళ్లకి నచ్చినోళ్లకి ఇస్తారు..ఇప్పటి విషయానికి వస్తే ఆకృతి అనే సంస్థ హెచ్ఎం రెడ్డి అవార్డు సురేందర్ రెడ్డికి ఇస్తుందట..ఇతగాడు సినిమాలు చూస్తే ఏ విలువలు సమాజానికి నేర్పుతారో ఎవరైనా చెప్తారా..సినిమాలు హిట్టవడమే పరమావధిగా భావిస్తే.. సన్నీలియోన్, షకీలా సినిమాలూ భారీగా సక్సెస్ అయ్యాయ్...వాటి డైరక్టర్లకూ ఇవ్వాలి..
మచ్చుకి  ఈ సురేందర్‌రెడ్డిగారే తీసిన కిక్  అనే సినిమాలో హీరోయిన్..హీరోని ఎక్కడ పట్టుకుంటుందోచూడండి..పైగా " వంకర నాకొడకా" లాంటి డైలాగులూ వల్లిస్తుంది..ఇదీ ఆయన సినిమా స్క్రీన్‌ప్లే..చెప్పండి ఇప్పుడు కూడా అర్హుడేనా...?
ఓ వేళ ఏ డైరక్టర్‌కి ఇవ్వాలో తెలీకపోతే..ఎవరూ దొరక్కపోతే ఆ సంవత్సరానికి వాయిదా వేస్తున్నామని చెప్పొచ్చు..లేదంటే ఆడియెన్స్‌నే పోల్ చేయమని అడగొచ్చు..ఐతే మా అవార్డులు మా ఇష్టం మా డబ్బుతో మేమిచ్చుకుంటే మీకేంటి అంటే..ఆ సంగతి కూడా ఓపెన్‌గా చెప్పండి..ఏ బాధా ఉండదు.

Comments