గుణశేఖ‌ర్‌పై అప్పటి పగని జీవిత రాజశేఖర్ ఇప్పుడిలా తీర్చుకున్నారా..ఇందులో నిజమెంత


నంది అవార్డుల ప్రసహనం ఇప్పట్లో తెగదు..దీనిపై లోకవీరుడు ఏ అంశంపైనైనా తనకి తప్ప ఇంకొకరికి హక్కు లేదనే ధీరుడు, అసెంబ్లీ సెషన్స్ సాకుతో కోర్టులకు హాజరుకానీ జ్యోతాంధ్రుడు ఓ పెద్దాయన రేపు డిస్కషన్ కూడా రెడీ అంటున్నాడు. ఐతే ఇవాళ జీవిత తమ జ్యూరీని సమర్ధించుకోవడానికి కొన్ని కాెమెంట్లు చేసింది ఐతే దీనికి కూడా గుణశేఖర్ బాగానే స్పందించాడు. అసలు బాహుబలితో  ఎక్కడా రుద్రమదేవి పోటీలో గెలవలేదని ఆమె చెప్పడం..అప్పుడు రెండో స్ధానం ఏమైందని..ఈయన ప్రశ్నించడం బాగానే ఉంది..కానీ వీళ్లిద్దరి మధ్యా ఈ గొడవ ఇప్పుడు బైటపడింది కానీ..దీనికి ముందే అంటే దాదాపు 20 ఏళ్ల క్రితమే ఓ సినిమా విషయంలో బాగా గొడవ పడ్డారు

అదేంటో చెప్తా పదండి..అప్పట్లో అంటే రాజశేఖర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు..ఆగ్రహం సినిమా టైమ్‌లో అన్నమాట..తెగింపు పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసారు..ఆ పేరుతో పాటు ఎవడైతే నాకేంటనే ఇంకోటి కూడా అప్పట్లో బాగానే విన్పించింది..ఐతే ఆ సినిమాకి డైరక్టర్ ఇదిగో ఇప్పటి గుణశేఖరే..ఆ సినిమా సెట్లపైనే ఆగిపోయింది దానికి కారణం కూడా రాజశేఖర్..గుణశేఖర్ మధ్య వచ్చిన విబేధాలే కారణమంటారు.

షూటింగ్స్ కి సరిగా రాకపోవడం, డైరక్షన్లో వేలు పెట్టడం కారణమని గుణశేఖర్..నా మొదటి సినిమా లాఠీ నంది అవార్డు వచ్చింది ఎలా తీయాలో నాకెవరూ చెప్పక్కర్లేదంటున్నాడని రాజశేఖర్ అండ్ కో ( లాఠీలో  ప్రశాంత్, సంయుక్త హీరోహీరోయిన్లు) ఆరోపణలు విసురుకున్నారు..అదలా ఆగిపోయింది..అదిగో అప్పట్నుంచే వీళ్లమధ్య అగాధం అలా ఉండిపోగా..ఇప్పుడిలా ఛాన్సు వచ్చింది కాబట్టి ఒకరిపై ఒకరు పైరవుతున్నారని అప్పటి సంగతులు తెలిసినవారంటున్నారు..నిజం ఉండొచ్చు..లేకపోవచ్చు..

ఐతే రాజశేఖర్ తీరుతో తేజ, శ్రీనువైట్ల కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం వాళ్లే పేరు పైకి చెప్పకుండా ఓపెన్‌గానే చెప్తారు..తేజ సినిమా పేరు తెలీదు కానీ...వి.శ్రీను పేరుతో శ్రీనువైట్ల డాన్ అని..అపరిచితుడు అని రెండుసార్లు పేరు మార్చిన  ఆ సినిమా చివరకు రిలీజ్ కాకుండానే పోయింది..ఆ మూవీలో హీరోయిన్ సాక్షి శివానంద్..వల్లభనేని జనార్దన్ దానికి కొన్నాళ్లు నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాడు కూడా..అంతెందుకు పట్టపగలు అని ఓ మూవీ రామ్ గోపాల్ వర్మతో ఫినిషింగ్ స్టేజ్ లో ఉండి కూడా మధ్యలోనే ఆపేసిన ఘనుడు రాజశేఖర్..అది వర్మవైపు తప్పు ఉండవచ్చు..ఈయనవైపు తప్పు ఉండవచ్చు విషయమైతే రాజశేఖర్ తో డీల్ చేయడం అంత ఈజీ కానే కాదు..బహుశా ఈ రీజన్ తో కూడా వర్మ జ్యూరీపై మాంఛి సెటైర్లు దింపుతున్నట్లు అనుకోవచ్చు

Comments