జైల్లో పడబోయి తప్పించుకున్న బండ్ల గణేష్



ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన గణేష్‌కి కోర్టు 6నెలలు జైలు శిక్ష విధించింది. ఐతే బెయిల్ కి అప్లై చేసుకోగానే
కోర్టు మంజూరు చేయడంతో చిప్పకూడు తినే అదృష్టం తృటిలో తప్పించుకున్నాడు. విషయం ఏంటంటే
టెంపర్ సినిమాకి స్టోరీ ఇచ్చినా అందుకు భత్యం మాత్రం ఇవ్వలేదంటూ వక్కంతం వంశీ కేసు పెట్టాడు. దానికి గానూ
ఇచ్చిన 25లక్షల చెక్కు కూడా బౌన్స్ కావడంతో కేసు బలంగా తయారైంది. అప్పట్నుంచీ కేసు విచారణలు జరుగుతూ జరుగుతూ ఇవాళ జడ్జిమెంట్ వచ్చేసింది. పాతికలక్షల రూపాయలు మాత్రమే కాకుండా ఈ రెండేళ్లూ అనుభవించిన క్షోభ ప్లస్ నష్టపరిహారం కింద మరో 15లక్షల 86వేల రూపాయలు కూడా కట్టాల్సిందేనంటూ తీర్పు ఇచ్చింది కోర్టు

 నిర్లక్ష్యం చూపించినందుకు 6నెలలు జైలుశిక్ష కూడా అనుభవించాల్సిందేనంటూ కోర్టు చెప్పడంతో  బండ్లగణేష్‌కి మిడిగుడ్లు పడ్డాయ్.

ఈ పరిణామాన్ని ముందే ఊహించాడు కాబట్టి..వెంటనే బెయిల్‌కి అప్లై చేసుకున్నాడు. కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో గణేష్ ప్రస్తుతానికి బైటపడ్డాడు. దీంతో ఓ స్టోరీకి ప్రొడ్యూసర్ ఎంత ఇస్తాడో తెలిసి వచ్చింది. ఇదే హిట్ సినిమా ఇచ్చిన రైటర్ ఓన్లీ స్టోరీ వరకూ కనీసం అరకోటి వరకూ వసూలు చేస్తాడనే విషయం జనాలకు తెలుస్తోంది. మరోవైపు మీడియా ముందు తెగ బిల్డప్పులు ఇచ్చే ప్రొడ్యూసర్ల అసలు వేషం కూడా గణేష్ ఎపిసోడ్‌తో తేటతెల్లం అవుతోంది

Comments