బెల్లంకొండ స్రవంతి రవికిషోర్ ని బ్లాక్ మెయిల్ చేసాడా?


తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..మరి ఎక్కడ చెడిందో తెలీదు కానీ..బెల్లంకొండ సురేష్ స్రవంతి రవికిషోర్ ని బ్లాక్ మెయిల్ చేశాడట..అది కూడా ఉన్నది ఒకటే జిందగీ అనే మూవీని అప్లోడ్ చేస్తా..ఇంటర్‌నెట్‌లో అని బెదిరించాడట! అసలు ఇలా బెదిరించడం ఏంటని ఆరా తీస్తే..ఈ ఇష్యూపై తెలుగు చిత్రనిర్మాతల మండలి కూడా సీరియస్‌గా దృష్టి పెట్టిందట.

ఎందుకంటే బెల్లంకొండ బెదిరింపుల్లో." ఈ ఒక్క సినిమానే కాదు..తెలుగు. తమిళం..ఏ భాషలో సినిమా అయినా నాకో కాపీ తెచ్చుకోగల సత్తా ఉంది..రోబో 2.0 కూడా తీసుకురాగలను" అని సవాల్ విసిరాడట..దీంతో పైరసీ ఎక్కడో ఎవడో చేయడం కాదు, ఇండస్ట్రీలోని యెదవల వల్లే జరుగుతుందనుకున్నారో..లేక ఈ గోలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారో కానీ...అర్జంట్ గా అందరికీ వర్తమానాలు పంపించేసి తెలుగు చిత్రనిర్మాతల మండలి మీటింగ్ పెట్టుకుందట..స్రవంతి రవికిషోర్, బెల్లంకొండ వివాదం సెటిల్ చేసుకున్నా...అసలు ఈ సవాల్ విసరడం ఏంటి..ఇండస్ట్రీలో ఇలా చేస్తే ఎలా అనే కాన్సెప్ట్‌తోనే ఈ మీటింగ్ ఏర్పాటైంది..మిగిలిన విషయాలు త్వరలోనే తెలిసిపోతాయ్..ఐతే గతంలో రామ్ బెల్లంకొండకి ఇచ్చేస్తా అన్న కోటిరూపాయల పాతికలక్షలని ఇవ్వనందుకే పగబట్టి బెల్లంకొండ సురేష్ ఈ బ్లాక్ మెయిల్‌కి దిగాడనేది డెక్కన్ క్రానికల్ కథనం. ఇంతకీ నిజంగా బెల్లంకొండ సురేష్ కి అంత సత్తా ఉందా..!

Comments