పాదయాత్రకి పర్మిషనేంటి! జగన్ మాత్రమే చేయకూడదా!


వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, చంద్రబాబు ఇంకా చాలామంది లీడర్లు పాదయాత్రతో తమ ఇమేజ్ పెంచుకున్నారు..జనంలోకి దూసుకెళ్లారు(ఆపసోపాలు పడుతూనే). వీటిలో వైఎస్ చేసినయాత్ర అపూర్వం అనే చెప్పాలి. ఎందుకంటే అది నడి ఎండల్లో..చేసింది..చంద్రబాబు చేసింది తక్కువ కాదు కానీ..దానికి మీడియా బూస్టప్ ఎక్కువ..రాజశేఖర్ రెడ్డి టైమ్ లో అన్ని ఛానళ్లు లేవ్..కేవలం ఈనాడు,వార్త పత్రికల్లో చూసి కథలు కథలుగా చదువుకోవడం మాత్రమే సాధ్యమైంది..ఇక ప్రస్తుతానికి వస్తే వైఎస్ జగన్ ప్రజాసంకల్పం పేరుతో ఓ యాత్ర చేస్తానన్నారు.



ఐతే ఈ యాత్రపై ముఖ్యమంత్రి నుంచీ ప్రతి ఒక్కరూ చేస్తోన్న విమర్శలు..వారు చెప్తోన్న కారణాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎవరేం చేసినా...దానికి ప్రభుత్వం అనుమతి తప్పని సరి అని చెప్పాలేమో! లేదంటే పాదయాత్రకి పర్మిషనేంటి..ఊరూరా శుధ్ది చేస్తామనడమేంటి..మురికిపట్టిపోయిన గుంతలు పడ్డ రోడ్లని నిజంగా టిడిపి లీడర్లు శుభ్రం చేస్తామంటే..జగన్‌ని ప్రతి ఊరూ ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం..టిడిపి ఎంత విమర్శిస్తే..అంతగా జగన్ యాత్రకి మైలేజీ పెరుగుతుంది.. ఎందుకంటే..నా మానాన నేను ఐదు రోజులు నడిచి...తిరిగి కోర్టుకి హాజరవుతాననే లీడర్ యాత్రపై సీరియస్‌నెస్ అది జరిగే తీరుని బట్టే ఉంటుంది..అలాంటి పాదయాత్రపై అనవసరంగా టార్గెట్ పెట్టండి..విమర్శలు చేయండి అని అనడం చంద్రబాబు స్థాయికి తగినది కాదు..ఎందుకంటే వస్తున్నా మీకోసం అంటూ ఆయన చేసిన యాత్రకి ఎవరూ అడ్డంకులు పెట్టలేదు కదా..! ఇది గతం తెలిసినవారి కామెంట్.

పైగా పాదయాత్రలో విధ్వంసం జరుగుతుంది అనే వ్యాఖ్యచూస్తే...ఏమైంది వీళ్లకి అన్పించకమానదు..ముద్రగడ పద్మనాభం విషయంలో ఇలా చేసి..అభాసు పాలవుతున్నారు..ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్రని అడ్డుకుంటే..(ఓవేళ) అది జగన్‌కే అడ్వాంటేజ్ అవుతుంది..ఇది తథ్యం..జగన్‌కి ఇలాంటివి కొత్తేం కాదు..ఎందుకంటే..ఓదార్పు యాత్ర పేరుతో అతను చేసిన హంగామా అందరూ చూసిందే.. ప్రతి పల్లెకీ ప్రతి గుడిసెకీ వెళ్లడంతో అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పల్లెలు, ఇన్ని ఊళ్లూ ఉన్నాయా అని తెలిసివచ్చింది. అది జగన్ కి ఎంత మైలేజీ ఇచ్చిందో చూశాం కూడా..ఇప్పుడదే జరుగుతుందని..టిడిపి భయపడుతుందని..వైఎస్సార్సీపీ కామెంట్..చూద్దాం ఇంకో నాలుగు రోజులు...!



Comments