వేసేయండి వీరతాడు..వాణీ విశ్వనాధ్‌కి! మరోటి బోయపాటికి!



ఇన్నాళ్లూ చంద్రబాబుకి ఈ మాత్రం తెలివిలేకపాయే! ఉండుంటే వాణివిశ్వనాధ్ లాంటి తురుపు ముక్కని ఎప్పుడో వైఎస్సార్ కాంగ్రెస్ పైకి వదిలి ఉండేవాళ్లు..ప్రతిపక్షమే లేకుండా హ్యాపీగా ఏపీలో పాలన సాగుండేది. ఇప్పుడు సిఎంగారు ఎలాగైతే అమ్మయ్య సభలో అప్పోజిషన్ ఇక లేదు..చక్కగా చర్చలు సాగించవచ్చును అని ఎలాగైతే ఆనందపడుతున్నారో..ఆ సిచ్యుయేషన్ గత మూడేళ్లుగా ఉండేది

అసలు వాణీవిశ్వనాధ్ ఎక్కడ్నుంచి వచ్చిందో తెలీకపోయినా..తెలుగుజనానికి ఆమె అదో సరదా..ఆమె సినిమాలు చేసింది తెలుగులో 36 లేదంటే 40 అయినా..ఆమెకి ఈ రోజుకీ క్రేజ్ ఉందంటే అది తెలుగువారి విశాల హృదయమే..
తెలుగులో ఎప్పుడు ఆఖరి సినిమా చేసిందో గుర్తులేకపోయినా...కృష్ణంరాజు, కృష్ణ, శోభన్‌బాబు, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, చిరంజీవి,  సుమన్, సురేష్ , రాజశేఖర్ , నరేష్ ఇలా పెద్ద పేరున్న హీరోలందరితోనూ నటించిందామె..అర్రర్రే మర్చిపోయా..ఎన్టీఆర్‌తో సామ్రాట్ అశోక-ఓ  రామా రామా నా చందమామా అంటూ గెంతులేసిన సంగతి ఇంకా కదలాడుతూనే ఉంది..

ఐతే ఇప్పుడెందుకు ఈ సింహావలోకనమంటే..జస్ట్ సదరు హీరోయిన్ గారు( ఇంకా  హీరోయినేంటి అంటారా) టిడిపిలో ఎంట్రీ  ఇస్తోందట..ఇస్తే ఇచ్చింది కానీ..ఈ సందర్భంగా ఆమె కామెంట్స్ సూపరెహ అనే రేంజ్‌లో ఉన్నాయ్..జగన్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకురావచ్చు కానీ..నెక్స్ట్ ఆమె పోటీ చేసేది కూడా పులివెందులలో జగన్‌పైనే కావచ్చు..లేదంటే నగరిలోనూ కావచ్చు..అసలు ఆమె ధాటికి వైఎస్సార్ కాంగ్రెస్ లీడర్లు వణికిపోతున్నారట. ఏ క్షణాన ఎన్నికలు వచ్చి ఆమె టిడిపి తరపున ప్రచారానికి దిగుతుందో అని భయపడుతున్నారట.. ఈ రేంజ్‌లో ఓ ఛానల్ తన మెరుగైన సమాజం కోసం ఓ పావుగంట టైమ్ కేటాయించి మరీ భాజా వాయించింది. పాలిటిక్స్ అంటే అంత వీజీ కాదు..అందులోనూ లేడీస్ అంటే మరీనూ..రోజాని ఎన్ని తిప్పలు పెడుతున్నారో చూస్తూనే ఉన్నాం...ఆమెపై ఎటాక్ చేయలేని ప్రతిసారీ ఏదో ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందని ఒకడూ..జబర్దస్త్ రోజూ బూతులు మాట్లాడుతుందని ఒకడూ రకరకాల వీడియోలు పోస్ట్ చేయడం చూస్తుంటాం.

మరి అప్పట్లోనే మాంఛి సెక్సీ ఇమేజ్ ఉన్న వాణీ విశ్వనాధ్‌ని వదిలిపెడతారని ఎందుకనుకుంటారు.
ఐతే ఈమె ధోరణి చూస్తే మాత్రం ఒకటి కన్ఫామ్‌గా చెప్పొచ్చు..అటు రోజూ..ఇటు జగన్ వీరిద్దరిపై ఎంత ఎక్కువ కామెంట్ చేస్తే అంత గుర్తింపు టిడిపిలో వస్తుందన్నది ఘంటాపథం.లేకపోతే..పాదయాత్ర చేయనీయండి..పాపాలు పోతాయనే కామెంట్ చేసిందంటే ఆమె ఎన్ని సంవత్సరాలుగా తెలుగు పాలిటిక్స్‌ని అబ్జర్వ్ చేస్తుందో తెలిసిపోతోంది..


ఐనా ఈ క్రెడిట్ అంతా డైరక్టర్ బోయపాటికే దక్కాలి..ఎందుకంటే తెలుగులో సోదిలో కూడా లేకుండా పోయిన వాణీవిశ్వనాధ్‌ని జయ జానకీనాయకాతో తెలుగుదేశానికి లాక్కొచ్చిన ఘనత ఆయనదే..చంద్రబాబుకి పరిచయం ఏమని చేశాడో కానీ..ఇప్పుడీ హాట్ లేడీ(వేరే ఉద్దేశం ఏమీ లేదు) కామెంట్స్‌కి మీడియా  బాగా స్పేస్ ఇస్తోంది..భలే మేనేజ్ చేస్తోంది ఈ మళయాళీ నటి మన తెలుగుమీడియాని అన్పించకమానదు..ఐనా ఇది కూడా బోయపాటి డైరక్షనే అనుకోవాలేమో..అందుకే వేయాల్సిందే వీరతాళ్లు

Comments