ఈయన్నేమీ అనొద్దట..అంబటి తెగ గెలికేశాడు..నోటీసులందుకున్నాడు


నాకు ఈ పదవి ఎంతో గొప్పది..అదృష్టం..నాపై వ్యక్తిగతంగా కామెంట్లు చేయడం బాదాకరం అంటూ ఓ పెద్దాయన ఇవాళ సెంటిమెంట్ రంగరించారు..దానికి తోడు వంధిమాగదులు అదే రేంజ్‌లో స్పందించారు..ఇక ఫిర్యాదులు..దర్యాప్తులు అన్నీ వాళ్ల చేతిలో పనే కదా..వెంటనే జగన్ పార్టీ లీడర్ అంబటి రాంబాబుకి ప్రివిలేజ్ మోషన్ పై నోటీసులు వెళ్లాయ్..

రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నంతమాత్రాన ఏం చేసినా చెల్లుతుందా..ఇదీఇప్పుడు ఏపీలో సాగుతోన్న చర్చ..అంబటిరాంబాబుకి ఎక్కడ కాలిందో ఏమో కానీ..ఎన్నడూ లేనట్లుగా స్పీకర్‌పై రెచ్చిపోయాడు. నంబర్ వన్ క్రిమినల్అంటూ విమర్సలకు దిగాడు..తానూ స్వతహాగా ఓ లాయర్..ఇలాంటి కామెంట్స్ చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు..ఐనా ఇలా నోరు జారాడంటే ఏదో ఉంది..అదేంటన్నదే ఇక రేపు ఎల్లుండి తేలుతుంది.సత్తెనపల్లి క్లబ్ మూసేసారు..దానికి ఈ పెద్దాయనే కారణమంటూ అంబటి కంప్లైంట్ చేస్తోన్నాడు..ఐతే ఈయనగారి కంప్లైంట్ ఎవరూ పట్టించుకోరు..అది తెలిసిన సంగతే..రాజ్యాంగం ఏవో సేఫ్టీ ఇచ్చింది కదాని..ప్రతి అంశానికీ దానికి ముడి పెట్టడం ఎంతవరకూ సబబనే చర్చ కూడా ఇప్పుడు ఇఁటర్నెట్ లో అటూ బైట కూడా ప్రారంభమైంది..ఏపీలో ఈయనగారి పుత్రరత్నం చాలా దందాలు నడుపుతున్నాడంటూ చాలా ఆరోపణలు వచ్చాయ్..పేపర్లలోనూ దీనికి సంబందించిన కథనాలు ఉన్నాయ్.. ఈమధ్యనే కోర్టు కూడా ఓ విషయంలో నోటీసులుజారీ చేసింది..దాన్ని ఎంత కప్పి పుచ్చుదామన్నా..కోర్టుడైరక్షన్స్ తో ఆ కేసు విచారణ చేపట్టకతప్పలేదు గుంటూరు జిల్లాలో..
పోనీ రాజ్యాంగబద్ద పదవిలోతీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా...అలా కాలయాపన చేయొచ్చా..దానికి చట్టంలోవెసులుబాటు ఉందా..? ఇది కూడా ఆలోచించాల్సిన ప్రశ్నే..ఎందుకంటే ఈ శాసనసభకి ఇక ఉన్నది ఏడాదిన్నర కూడా గడువులేదు..అప్పుడైనా ఈ నిష్క్రియా పర్వతానికి జవాబు చెప్పాల్సిందే కదా


Comments