మనిషికి సంతృప్తి చాలా ముఖ్యం..అదిప్పుడు చంద్రబాబుగారికి బాగా దక్కింది


ప్రతి మనిషికీ జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయ్. ఐతే అవి ఒకటి తీరిన తర్వాత మరోటిగా వస్తూనే ఉంటాయ్. అలా నిత్యజీవితంలో సగటు మనిషి ఓ రకంగా అసంతృప్తజీవిగానే బతకాలి..కానీ ఏపి సిఎం చంద్రబాబుగారు ఇవాళ అసెంబ్లీలో తనకి చాలా సంతృప్తిగా ఉందని..జీవితంలో ఇంతటి తృప్తి ఎప్పుడూ అనుభవించలేదని చెప్పారు.

 70 ఏళ్లు దగ్గర పడుతున్న ఏ వ్యక్తి అయినా వెనక్కి తిరిగి చూసుకుంటే కొ్న్ని విజయాలు..మరి కొన్ని అనుభవాలు..మరిన్ని జ్ఞాపకాలు ఉంటాయ్..మరి చంద్రబాబు గారు మాత్రం తక్కువ వ్యక్తి ఏం కాదు.. కాంగ్రెస్ నుంచి టిడిపి అక్కడ్నుంచి..దేశరాజకీయాల్లోనే చక్రం తిప్పిన వ్యక్తి.. ప్రపంచాన్ని కంప్యూటర్‌తో రఫ్పాడించేసిన బిల్‌గేట్స్‌ని ఇండియాకి రప్పించగలరు..అలానే బిల్‌క్లింటన్‌ని హైదరాబాద్ కి రప్పించారు. ముఖ్యమంత్రిగా..ప్రతిపక్షనేతగా ఆయన రికార్డు ఆయనదే..ఐతే ఇంత సుదీర్ఘ రాజకీయంలో ఎన్నడూ లేనట్లుగా ఇవాళ తృప్తి గురించి మాట్లాడారంటే, ఇక ఆయన మనసులో పునశ్చరణ ప్రారంభమయినట్లే అనుకోవాలి


ఎందుకంటే తాను ఎక్కని ఎత్తు లేదు. తర్వాత తాను చూస్తుండగానే పుత్రరత్నం లోకేష్‌కి మంత్రి దక్కించగలిగారు. బామ్మర్దిని ఎంఎల్ఏని చేశారు. కోడలు వ్యాపారంలో బాగానే రాణిస్తుంది. తొందర్లోనే రాజకీయాల్లోనూ వస్తుందంటున్నారు. ఐతే ఇవేవీ ఆయనకి తృప్తినివ్వలేదు. ఈ నాలుగేళ్ల ఏపీ  పాలనలో తాను సాదించిన అభివృధ్ది తనకి  తృప్తినిచ్చాయంటున్నారు. గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు, విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యం అని చెప్తున్నారు. ప్రజలు మేలు చేసినవారిని మర్చిపోరని చెప్తూ..వాళ్లకి ఇంత సాయం మేలు, అభివృధ్ది చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభవంగా చెప్పుకొచ్చారాయన.

ఐతే గిట్టనివాళ్లు మాత్రం ఎందుకు ఆయనకి తృప్తి..గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే ఎస్పీవై రెడ్డిని పార్టీ మార్పించినందుకా..పుష్కర ఘాట్ దగ్గర తొక్కిసలాట జరగకుండా చేయలేనందుకా...లేక ఎమ్మార్వో వనజాక్షి పై చింతమనేని దాడి చేసినా...సమర్ధవంతంగా కవర్ చేసినందుకా అని అడుగుతున్నారు.

 రేవంత్ రెడ్డి కెమెరాల ముందు బేరాలాడుతూ బుక్కైనా..తాను మాత్రం ఎస్కేప్ అయినందుకా అని.. అంతేకాదు అనారోగ్యం పేరుతో ఓ మంత్రికి ఉద్వాసన పలికి పెద్దలసభకి చినబాబుని తెప్పించుకుని మంత్రి పదవి ఇచ్చినందుకు సంతృప్తిగా ఉందనుకుంటా అని ఎద్దేవా చేస్తున్నారు. ఏకంగా 20మంది ఎమ్మెల్యేలు  పార్టీ మార్పించుకుని కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగానే అటెండెన్స్ వేయించడం కూడా చాలా జాబ్ శాటిస్‌ఫాక్షన్‌గా ఉందనుకుంటా అని ఈసడిస్తున్నారు..ఎన్టీఆర్ సుజల పథకం ఎక్కడా అమలు చేయనందుకు..అన్ ఎంప్లాయీ పెన్షన్ ఇవ్వనందుకు..అన్నిటికన్నా...ఏపీకి స్పెషల్ స్టేటస్ ఉద్యమాన్ని తొక్కేసినందుకు పిచ్చ హ్యాపీగా ఉందా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు..లేదు అమరావతికి మట్టి నీళ్లూ తప్ప ఇవ్వని కేంద్రాన్ని నిలదీయనందుకు కూడా గెంతులేసినంత ఆనందమని..అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో...ఇంకా బ్రహ్మానందమని విమర్సిస్తున్నారు..ఇవన్నీ నిజాలైతే అవుగాక కానీ...ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఓరకంగా రాజకీయాల్లో తలపండిన నేత అనడంలో సందేహం లేదు..ఎందుకంటే ఇన్ని తప్పులు పెట్టుకుని కూడా పోల్ మేనేజ్‌మెంట్ , పీపుల్స్ పల్స్ మేనేజ్‌మెంట్ చేస్తున్నందుకు..ఇవాళ్ట ిరాజకీయాలంటే నిజంగా కత్తిమీద సామే మరి  అలాంటి పనిని సునాయాసంగా చేస్తోన్న చంద్రబాబుగారు నిజంగా అభినందనీయులే

Comments