పెళ్లిళ్ల కోసం అసెంబ్లీకే సెలవులా? యనమలకి ఫుల్ క్లాస్ పీకినా ఎందుకు సైలెంటయ్యాడు


అసెంబ్లీకి సెలవులంటూ స్పీకర్ గారు ప్రకటించడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూసి ఉండం..విని ఉండం..శుభకార్యాలకు హాజరు కావడానికని..హాలిడేస్ ప్రకటించడం గతంలో కూడా ఉందేమో కానీ ఇలా  ఓపెన్‌గా తెలియడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఐతే ఈ మూడురోజులు మాత్రం ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ఫర్వాలేదా అంటే నో ఆన్సర్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అప్పోజిషన్ లేకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎక్కడిక్కడ సమస్యలు తీరుస్తోన్న సభాయె! జీవితంలో ఎన్నడూ లేనంత తృప్తిగా ఉందంటూ అధినేతలే ప్రకటించారు కూడా..అలాంటప్పుడు నాలుగు రోజులు సెలవులు ఇవ్వడం కాస్త ఇబ్బందే మరి..
ఐతే ఈ ఇబ్బంది కంటే కూడా మంత్రి యనమలకి ఎమ్మెల్సీ శమంతకమణి పీకిన క్లాస్ మాత్రం మరీ దారుణం.
డైరక్ట్‌గా సింగిల్‌టోన్‌లో.." ఏమయ్యా..మీవాళ్ల పెళ్లిళ్లకేమో...అంతా కట్టగట్టుకుని పోడానికి సెలవులా...మా ఇళ్లలో(ఎస్సీల) పెళ్లికి రమ్మని అందరికీ ఇన్విటేషన్లు ఇచ్చినా అంతా ఎగ్గొట్టారు..పోలవరం చూడటానికంటూ అందరినీ తీసుకుపోయారు..రేపు మీ పయ్యావుల ఇంట్లో పెళ్లికి మాత్రం గుంపుగా పోడానికి సెలవులిచ్చేస్తారా... ఇదేమైనా న్యాయంగా ఉందా?" అంటూ చెడామడా వాయించేసిందామె..ఇది ప్రత్యక్షంగా చూసినవాళ్లంతా అరె..అంతా క్షణాల్లోనే ఐపోయిందే అనుకుంటూ గుసగుసలాడుకున్నారు.

మొత్తానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లే ఇలా కామెంట్లు చేసుకుంటున్నప్పుడు బైట జనం..ప్రతిపక్షనేతలు టిడిపిని విమర్శిచడంలో తప్పేంటని అంటున్నారు. వారం క్రితమే శమంతకమణి మనవరాలి పెళ్లి జరిగితే  టిడిపి పెద్దలెవరూ హాజరుకాకపోవడంతో..అప్పట్నుంచీ కడుపు రగిలిన శమంతకమణి పాత సినిమాల్లో రుష్యేంద్రమణిలా మారిపోయి శాపనార్ధాలు పెట్టిందన్నమాట

Comments